White Hair Solution Home Remedies: జుట్టు అందంగా ఉండడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. దీని కారణంగా చాలా మంది తెల్ల జుట్టు సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగించడమేకాకుండా.. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి హెన్నాను వినియోగించి ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల జుట్టులో చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి.
ఈ ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యలు మాయం!:
హెన్నా, నిమ్మరసం:
జుట్టులో చుండ్రు సమస్య, జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హెన్నాలో నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే గుణాలు స్కాల్ప్‌ను శుభ్రం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 5 చెంచాల హెన్నా పొడిని తీసుకోండి. దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి.. మిశ్రమంలా తయారు చేసుకోవడానికి నీటిని కలపాల్సి ఉంటుంది. ఇలా నీటిని కలిపిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
గుడ్డు:
జుట్టు నుంచి చుండ్రు, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు హెన్నాతో గుడ్డును కలిపి జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మొదట 5 చెంచాల హెన్నా ఒక గిన్నెలో తీసుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులు లేదా బ్రష్ సహాయంతో జుట్టుకు అప్లై చేసి తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు సమస్యలు దూరమవుతాయి.
పెరుగు:
పెరుగు జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ డాండ్రఫ్ గుణాలు స్కాల్ప్‌లోని మురికిని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు పెరుగులో హెన్నా కలిపి జుట్టుకు కలిపి అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
White Hair Solution: ఏం చేసిన తెల్ల జుట్టు మిమ్మల్ని వదలడం లేదా?, ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 20 నిమిషాల్లో చెక్!