Vijendra Prasad Launches Matru First Look: సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్లర్ 'మాత్రు' ఫస్ట్ లుక్ విడుద‌ల‌..

Vijendra Prasad Launches Matru First Look:  సెన్సేష‌న‌ల్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ మూవీల‌తో రైట‌ర్‌గా గ్లోబ‌ల్ లెవ‌ల్లో ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమా కోసం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత‌ర బిజీ షెడ్యూల్లో కూడా ఈయ‌న సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ మాత్రు మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 9, 2024, 07:32 PM IST
Vijendra Prasad Launches Matru First Look: సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్లర్ 'మాత్రు' ఫస్ట్ లుక్ విడుద‌ల‌..

Vijendra Prasad Launches Matru First Look:  సెన్సేష‌న‌ల్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ మూవీల‌తో రైట‌ర్‌గా గ్లోబ‌ల్ లెవ‌ల్లో ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమా కోసం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత‌ర బిజీ షెడ్యూల్లో కూడా ఈయ‌న సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ మాత్రు మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు.

Vijendra Prasad Launches Matru First Look: సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్స్ గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన మూవీ మాత్రు.  పూర్తి యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.  శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలియ‌జేసారు.  ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ ఈ సినిమాలో లీడ్ రోల్లో ఉన్న ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో అలీ, దేవి ప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌పీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సత్యనారాయణ ఎడిడింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. .

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్టు తెలిపారు. రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ మూవీల‌తో రైట‌ర్‌గా గ్లోబ‌ల్ లెవ‌ల్లో ఫేమ‌స్ అయ్యారు. అంతేకాదు ప్యాన్ ఇండియా లెవ‌ల్లో ప‌లు భాష‌ల‌కు సంబంధించిన సినిమాల‌కు కథ‌ల‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా సేవ‌లు అందిస్తున్నారు.

తారాగణం: సుగి విజయ్, రూపాలిభూషణ్, శ్రీకాంత్, రవి కాలే, పృధ్వీ రాజ్, అలీ, దేవి ప్రసాద్, ఆమని, నందిని రాయ్ తదితరులు

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: జాన్ జక్కీ
బ్యానర్: శ్రీపద్మినీ సినిమాస్
నిర్మాత:  బి.శివప్రసాద్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రాహుల్ శ్రీవాస్తవ్
ఎడిటర్: సత్యనారాయణ
ఫైట్స్: నందు మాస్టర్

Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News