Prabhutva Junior Kalasala: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల' మూవీ..

Prabhutva Junior Kalasala: అంతా కొత్తవాళ్లతో శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఈ నెల 21న విడుదలైన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు పలు చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Last Updated : Jun 24, 2024, 09:13 AM IST
Prabhutva Junior Kalasala: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల' మూవీ..

Prabhutva Junior Kalasala:  శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం పై ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జోడిగా నటించిన చిత్రం  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను  శ్రీనాథ్ పులకురం  దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా ఈ మూవీని నిర్మించారు. 2024, జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు కుటుంబ ప్రేక్షకుల మనసులను దోచుకొని బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' జూన్ 21న విడుదలైన ఈ సినిమా యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది.  ఈ వారం మొత్తం 11 చిత్రాలు విడుదల అయ్యాయి, అందులో మా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రం కలెక్షన్స్ లో దూసుకుపోతున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది.

డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్ చూసి థియేటర్స్ పెంచుతున్నారు. అలానే సినిమా బాగుంది అనే మాట సోషల్ మీడియా లో కూడా చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు చూసిన ప్రేక్షకులు తమ కాలేజీ రోజుల్లుని గుర్తు చేసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో తల్లీ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగనికి గురి చేసాయి. పాటలు సైతం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి.  మ్యూజిక్ లవర్స్ కి కూడా మా చిత్రం నచ్చేలా ఈ  సినిమా ఉందంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు.

మార్నింగ్ షో కన్నా మాట్నీ ఆట కి, మాట్నీ కన్నా ఫస్ట్ షో కి కలెక్షన్ లు పెరిగాయి. సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు సినిమా బాగుందనే కామెంట్స్ చేస్తున్నట్టు ఈ మూవీ దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు. నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News