Gorre Puranam: సుహాస్ ఈ మధ్యకాలంలో డిఫరెంట్ స్టోరీలతో టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఈయన ‘గొర్రె పురాణం’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ కనిపించకపోవడంతో ఈ సినిమా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. రిజల్ట్ ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే డైరెక్టర్స్ చాలా రేర్ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు గొర్రె పురాణం సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశాడనే చెప్పాలి. హిందీలో వచ్చిన పీపిలీ లైవ్, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ చిత్రం ఉందని అంటున్నారు. భారతీయ సినిమాల్లో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా అరుదు. గొర్రె పురాణం సినిమాతో దర్శకుడు బాబీ వారి వరుసలో చేరారని క్రిటిక్స్ చెబుతున్నారు.
గొర్రె పురాణం సినిమాలో పోస్టర్ల మీద మొత్తం సుహాస్ కనిపించినా.. సినిమాలో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది. దాని వలన మొదటి రోజు చూసిన ఆడియన్స్ కొంత నిరాశ చెందారు. దాంతో ఫస్ట్ డే పబ్లిక్ టాక్ అంతంత మాత్రమే ఉన్నా క్రమంగా సూపర్ టాక్ తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఇలాంటి చిత్రం అంతా ఆషామాషీ కాదంటున్నారు. గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంత ఈజీ కాదు. దానికి కోసం క్రూ మెంబర్స్ ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి టాలెంట్ ను అందరు మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
లో బడ్జెట్ తో తెరకెక్కిన గొర్రె పురాణం సినిమాకు సరైన పబ్లిసిటీ కూడా చేయలేదు. హీరో సుహాస్ సపోర్ట్ లేకపోయినా.. ప్రేక్షకుల మౌత్ టాక్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడం విశేషం. సినిమా చూస్తే ఎంత తక్కువ బడ్జెట్ లో తీసారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ మూవీ తీయడంలో డైరెక్టర్ బాబీ కృషిని మెచ్చుకోవాలి. అయితే మలయాళం, తమిళం సినిమాల్లో కంటెంట్ ఉన్నా, ల్యాగ్ ఉన్నప్పటికీ మన వాళ్ళు ఆదరిస్తారు. ఇదే గొర్రె పురాణం సినిమా విషయంలో కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఉందని విమర్శలు వస్తున్నాయి. అయినా అందరూ ఒక్క విషయన్ని ఆలోచించాలి ఇలాంటి సినిమాలు ఆదరించకపోతే కంటెంట్ ఉన్న సినిమాలో రావడం తగ్గుతాయనే మాట క్రిటిక్స్ నుంచి వినిపిస్తున్నాయి.
నటీనటులు : సుహాస్, పోసాని కృష్ణమురళి, రఘు తదితరులు.
దర్శకుడు : బాబీ
నిర్మాత : ప్రవీణ్‌రెడ్డి
సంగీత దర్శకుడు : పవన్ సి.హెచ్
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
బ్యానర్ : ఫోకల్ వెంచర్స్
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.