Dear Nanna: ఫాదర్స్ డే స్పెషల్.. చైతన్య రావ్ 'డియర్ నాన్న'..ఆ రోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

Dear Nanna: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంట్ తో దూసుకుపోతున్న నటుడు చైతన్య రావు. యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. తండ్రీ కొడుకులు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన  ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో నేటి నుంచి (జూన్ 14న )  స్ట్రీమింగ్  అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 14, 2024, 04:45 AM IST
Dear Nanna: ఫాదర్స్ డే స్పెషల్.. చైతన్య రావ్ 'డియర్ నాన్న'..ఆ రోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

Dear Nanna: తెలుగు సహా ఏ భాషలోనైన డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ప్రజలు ఆదరించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ నాన్న’. చైతన్య రావు లీడ్ రోల్లో, సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీకి రాకేష్ మహంకాళి,అంజి సలాది కథనం, మాటలు అందించారు. రాకేష్ మహంకాళి  కథతో పాటు నిర్మాతగా సినిమాను తెరకెక్కించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాదర్ డే స్పెషల్ గా జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన డియర్ నాన్న ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.  కరోనా బ్యాక్ డ్రాప్, ఫాదర్ ఎమోషన్, చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్ యూనిక్ గా వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాన్ని తాకుతున్నాయి. ఫాదర్స్ డే కి డియర్ నాన్న పర్ఫెక్ట్ ట్రీట్ అని చెబుతున్నారు.

ఈ చిత్రంలో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్, సుప్రజ్ ఇతరకీలక పాత్రలు పోహిస్తున్నారు. అనిత్ కుమార్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్. మొత్తంగా ఫాదర్స్ డే సందర్బంగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News