Em Chesthunnav: పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ 'ఏం చేస్తున్నావ్'.. ఈటివి విన్‌లో స్ట్రీమింగ్..

Em Chesthunnav - ETV Win: ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు.. థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ఏమ్ చేస్తున్నావ్ మూవీ ఒకటి. తాజాగా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  

Last Updated : Apr 25, 2024, 09:59 PM IST
Em Chesthunnav: పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ 'ఏం చేస్తున్నావ్'..  ఈటివి విన్‌లో స్ట్రీమింగ్..

Em Chesthunnav - ETV Win: ఈ మధ్యకాంలో ఓటీటీలో రిలీజైన సినిమాల్లో మంచి కంటెంట్‌తో కూడిన సబ్జెక్ట్ ఉంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఏం చేస్తున్నావ్' మూవీకి అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. చాలా సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ అందుకుంటోంది. ఇందకు ముందు ముందు 90s, వలరి, తులసి వనం, వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈటీవి విన్ ఇప్పుడు ఈ  'ఏం చేస్తున్నావ్' మూవీతో  తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.   ఎన్ వి ఆర్ ప్రొడక్షన్స్, సిద్స్ క్రియేటివ్ బ్యానర్ పై  నవీన్ కురువ, కిరణ్ కురువ నిర్మాతలుగా 'ఏం చేస్తున్నావ్' మూవీని నిర్మించారు. ఈ సినిమాకి  భారత్ మిత్ర రచన, దర్శకత్వం వహించారు. ఎన్నో సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు.  

‘ఏం చేస్తున్నావ్’ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుండటంతో  చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.  హీరో రాజ్ పెర్ఫార్మన్స్ కి మంచి ప్రసంశలు వచ్చాయి. యూత్ కి నచ్చే ఎన్నో ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉన్నాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న యూత్ అందరూ రిలేట్ అయ్యేలా ఈ సినిమా ఉంది.  కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది.

ఈటీవి విన్ మార్కెటింగ్ హెడ్ నితిన్ మాట్లాడుతూ:  ఈ సమ్మర్‌లో బడా  సినిమాలు ఏమి లేవు. ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం చూడాలిసిన సినిమా అన్నారు.  మీరు ఈ సినిమా చూస్తున్నంత సేపు అస్సలు రీగ్రేట్ అవ్వరని చెప్పారు.  ఈటీవి విన్ లో ప్రేక్షకులు రీగ్రేట్ అయ్యే కంటెంట్ అస్సలు రాదన్నారు.

ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ: ఈ సినిమాలో చాలా వాటికి మనం రిలేట్ అవుతాము, రోజు మనం చూసే మన పక్కింటి వాళ్ళు, చుట్టాలు అందరు ఈ సినిమాలో కనిపిస్తారని ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది.  భరత్ చాలా బాగా రాశారు, డైరెక్ట్ చేసారు. ప్రేక్షకులు రిలేట్ అయ్యే కంటెంట్ ఈరోజుల్లో చాలా తగ్గిపోయింది. ఈ సినిమాలో ఈటీవి విన్ లో చాలా మంచి సక్సెస్ అయ్యింది.

డైరెక్టర్ భారత్ మిత్ర మాట్లాడుతూ: మా ప్రొడ్యూసర్ నవీన్ వల్లనే ఈ సినిమా చేశాను, తను ఒక చిన్న ఊరులో బట్టలు కొట్టు పెట్టుకుని ఏడు సంవత్సరాలు దాచుకున్న డబ్బులతో ఈ సినిమా చేశారు. తరవాత బడ్జెట్  పెరిగింది, అప్పుడు హేమంత్ టీంలోకి వచ్చారు.అందరికి చాలా బాగా రీచ్ అయింది సినిమా, మీమర్స్ ద్వారా సినిమా ప్రేక్షకులలోకి వెళ్ళిందన్నారు. అందుకనే ఏలూరు శ్రీను సలహా మేరకు మీమర్స్ అందరితోనే మా సక్సెస్ జరుపుకుంటున్నామన్నారు.

తారాగణం:
విజయ్ రాజ్ కుమార్
నేహ పతన్
అమితా రంగనాథ్
ఆమని
రాజీవ్ కనకా

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News