Vastu tips for house: వాస్తు ఇలా ఉంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉండవా ?

Vastu tips for good luck, health and wealth: ఇంటి ముఖ ద్వారం, గేట్లు, ఎంట్రీ పాయింట్స్‌ను ఏపుగా పెరిగే పెద్ద పెద్ద మొక్కలు, చెట్ల పొదలతో కప్పివేయవద్దు. ద్వారం ఎప్పుడూ వీలైనంతగా విశాలంగా ఉండాలి. అది జీవితం పట్ల ఉండే స్పష్టతను సూచిస్తుందని వాస్తు నిపుణులు (Vastu experts) చెబుతుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2021, 12:52 PM IST
Vastu tips for house: వాస్తు ఇలా ఉంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉండవా ?

Vastu tips for good luck, health and wealth: ఇంటి ముఖ ద్వారం, గేట్లు, ఎంట్రీ పాయింట్స్‌ను ఏపుగా పెరిగే పెద్ద పెద్ద మొక్కలు, చెట్ల పొదలతో కప్పివేయవద్దు. ద్వారం ఎప్పుడూ వీలైనంతగా విశాలంగా ఉండాలి. అది జీవితం పట్ల ఉండే స్పష్టతను సూచిస్తుందని వాస్తు నిపుణులు (Vastu experts) చెబుతుంటారు.

ఇంటికి ఈశాన్య దిశలో (Trees and plants in northeast) మొక్కలు ఉండరాదు. ఇంటికి ఉత్తరాన కానీ లేదా తూర్పున కానీ చిన్న చిన్న మొక్కలు నాటితే ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 

ఇంటి ఆవరణలో పెద్దగా పెరిగే చెట్లు నాటాలి అనుకున్నప్పుడు వాటిని ఇంటికి పశ్చిమ దిశలో కానీ లేదా దక్షిణాన కానీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇంటికి నైరుతి దిశలోనూ (Trees in southwest) పెద్ద పెద్ద చెట్లు ఉండేలా చూసుకోవచ్చు.

Also read : Mud bathing heath benefits: మడ్ బాతింగ్ ఆరోగ్య ప్రయోజనాలు హైలైట్ చేసిన Urvashi Rautela

ఇంటి ఆవరణలో పెద్దగా పెరిగే చెట్లు నాటాలి అని అనుకున్నట్టయితే, వాటి నీడ బెడ్ రూమ్‌పై (Bed room vastu tips) పడకుండా ఉండేలా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  

ఇంట్లో అందంగా అలంకరించే మొక్కల్లో రావి చెట్టు (Peepal tree), వేప చెట్టు మొక్కలు ఉన్నట్టయితే, వాటి వేర్లు బలంగా ఏనుకునే అవకాశం ఉన్న కారణంగా ఇంట్లో ఫ్లోరింగ్ పాడయ్యే ప్రమాదం ఉంది.

Positive plants: పాజిటివ్ వైబ్స్ అందించే మొక్కలు:
తులసి మొక్క (Tulsi plants) శాంతి, సామరస్యాలకు ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకే తులసి మొక్కలు (Tulasi plants) ఇంటి పెరట్లో మధ్యలో (Home gardens) ఉండేలా చూసుకోవాలి.

Also read : Luck with marriage : ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

బ్రహ్మజెముడు (Cactus) లాంటి ముల్లు జాతి మొక్కలు, వృక్షాలు ఇంట్లో నాటరాదు అని కొందరు చెబుతున్నప్పటికీ.. అవి ఇంట్లో పెంచుకుంటే ప్రయోజనాలు (Cactus plant uses) ఉన్నాయని చెప్పే వాళ్లు కూడా లేకపోలేదు.

పూల కుండీలు (Flower pots) ఇంట్లో ఉత్తర దిశలో కానీ లేదా తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయనేది వాస్తు నిపుణుల సూచన.

Waterfalls at home: ఇంట్లో వాటర్‌ఫాల్స్‌తో అలంకరణ
ఇంటి ఆవరణలో ఉత్తర దిశలో లేదా తూర్పు దిశలో అలంకరణ కోసం ఉపయోగించే జలపాతం ఉన్నట్టయితే, ఆ ఇంట్లో సిరిసంపదలు (Vastu tips for money) కూడా జలపాతంలాగే పొంగిపొర్లుతుంటాయనేది కొంతమంది వాస్తు నిపుణుల బలమైన విశ్వాసం.

Also read : Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

ఇంటికి తూర్పున, పశ్చిమ దిశలో మొక్కల మధ్య చెక్కతో చేసిన బెంచ్ ఏర్పాటు చేసుకున్నట్టయితే, ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యోదయం, సూర్యస్తమయం సమయాల్లో సూర్య కిరణాలు ముఖం పడేలా ముఖం చేసుకుని కూర్చుని సేద తీరితే చర్మానికి ఆరోగ్యంతో (Health tips for skin care) పాటు మనసుకు ప్రశాంతంగానూ ఉంటుంది. 

ఇంటికి తూర్పున కానీ లేదా పశ్చిమ దిశలో కానీ గార్డెన్‌లో యోగా (Yoga at home) చేసుకోవడానికి అనువుగా కొంత ఖాళీ స్థలం ఏర్పాటు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లో ప్రాణ వాయువు అందించడంతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్టు (Neem tree leaves health benefits) ఉండటం మంచిది. 

Also read : Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News