Calcium Rich Foods: శరీరానికి అనేక పోషకాల అవసరం ఉంటుంది. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. కొందమంది విటమిన్ లోపంతో బాధపడుతంటారు. అందులో కాల్షియం సమస్య ఒకటి. కాల్షియం లోపించినప్పుడు ఎమకులు నొప్పి, కీళ్ల నొప్పు సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా తమ పనులు చేసుకోవడంలో ఇబ్బుందులు పడుతుంటారు. చాలా మంది కాల్షియం పాలలో లభిస్తుందని అనుకుంటారు. కొంతమంది పాలను ఆసలు తాగరు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే కాల్షియం ఉండే ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్షియం లభించే ఆహార పదార్థాలు ఇవే:
పెరుగు:
ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కప్పు పెరుగులో మూడు వందల గ్రాముల కాల్షియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగలో తాజా పండ్లు వేసుకుని తింటే చాలా మంచిది.
రాగి పిండి:
రాగి పిండి కీళ్ల నొప్పులు, ఎముకుల నొప్పులకు ఎంతో మేలు చేస్తుంది. రాగి పిండిలో కాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు రాగి జావ, రాగి లడ్డు తినడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు.
టోఫు:
టోఫు అనేది పనీర్‌లాగే ఉంటుంది. దీనిని మనం సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో కాల్షియం లభిస్తుంది. ఈ టోఫును కూరగా లేద సలాడ్‌లో ఉపయోగించవచ్చు.
బాదం పప్పులు:
డ్రై ఫూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో బాదం ఒకటి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. దీని నానబెట్టి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చియా గింజలు:
చియా గింజలు తీసుకోవడం వల్ల కాల్షియం లోపం నుంచి బయటపడవచ్చు.ఈ చియా గింజలను జ్యూస్‌లో, మిల్క్ షేక్‌లో, స్మూతీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Also Read Valentines day 2024: వాలెంటైన్స్ డే వెనుక ఉన్న కథ ఇదే.. వారం మొత్తం ఏదో ఒక ప్రత్యేకత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter