Skin Care Tips: రైస్‌ ఫేస్‌ ఫ్యాక్‌తో మెరిసే చర్మం మీ సొంతం!

Skin Care Tips At Home: చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు చర్మానికి రైస్‌ ఫేస్‌ ఫ్యాక్‌ అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 05:15 PM IST
Skin Care Tips: రైస్‌ ఫేస్‌ ఫ్యాక్‌తో మెరిసే చర్మం మీ సొంతం!

Skin Care Tips At Home: ముఖంపై చర్మం మెరిస్తేనే ఫేస్‌ అందంగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యం కారణంగా చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్లోయింగ్ పొందడానికి ఖరీదైన క్రీములు వినియోగించకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రైస్ ఫేస్ ప్యాక్‌ని కూడా వినియోగించవచ్చు. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కేవలం నెల రోజుల్లోనే చర్మంపై మంచి ఫలితాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఫేస్‌ ఫ్యాక్‌లను ఎలా వినియోగించాలో, వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్‌ ఫేస్‌ ఫ్యాక్‌ తయారి పద్ధతి:

బియ్యం, పచ్చి పాలు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి..
ముందుగా 4 చెంచాల బియ్యం తీసుకోవాలి.
వాటిని 4 గంటలు నీటిలో నానబెట్టండి.
అందులో పచ్చి పాలు పోయాలి.
ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసి కలపాలి.
పేస్ట్ చిక్కగా అయ్యాక ముఖానికి పట్టించాలి.
తర్వాత ముఖాన్ని  1 గంట అలాగే ఉంచాలి.
ఇప్పుడు తేలికపాటి చేతులతో ముఖాన్ని రుద్దాలి.
తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
వారానికి కనీసం 3 సార్లు దీనిని అప్లై చేయాల్సి ఉంటుంది.

ముఖంపై రైస్ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
రైస్ ఫేస్ ప్యాక్‌ను వినియోగించడం వల్ల చనిపోయిన చర్మం తొలగిపోతుంది. దీని వల్ల ముఖం యవ్వనంగా, తాజాగా తయారవుతుంది.
బియ్యంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి.సన్‌బర్న్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది.
బియ్యంలో ఉండే ఫెరులిక్ యాసిడ్ సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
ఇందులో ఉండే గుణాలు చర్మం జిడ్డు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read; Prashanth Neel Clarity: వెంకటేష్ మహా ప్రశ్నలకు అప్పట్లోనే సమాధానం చెప్పిన ప్రశాంత్ నీల్.. వీడియో వైరల్!

Also Read: Amala Paul Dance Video: డ్యాన్స్ వీడియో షేర్ చేసి టాప్ లేపేసిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ టీజింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News