Side Effects Of Spinach: బచ్చలికూరలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే చాలా మంది వైద్యులు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి దీనిని ఆహారంలో తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. వారంలో ఒక్కరోజైనా చాలా మంది బచ్చలికూరను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల గుండె సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకునేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ బచ్చలికూర తీసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దీని కారణంగా తీవ్ర దుష్ప్రభావాల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బచ్చలికూరను ఈ 3 రకాలుగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పచ్చి పాలకూర:
ప్రస్తుతం చాలా మంది బచ్చలికూర నుంచి గరిష్టంగా పోషకాలు పొందడానికి సలాడ్స్‌లో పచ్చిగా తీసుకుంటున్నారు. ఇలా అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియంతో పాటు ఖనిజాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కిడ్నీల్లో రాళ్ల సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. కాబట్టి తరచుగా దీనిని ఆహారాల్లో తీసుకునేవారు పచ్చిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
స్పినాచ్ స్మూతీ:
పాలకూరను పెరుగు లేదా ఇతర పండ్లతో కలిపి స్మూతీలా తయారు చేసుకుని తాగడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఇలా మిక్స్ చేసి తీసుకోకపోవడం చాలా మంచిది.
Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు
పాలకూర రసం:
పచ్చి బచ్చలికూరలాగే, పచ్చి పాలకూర రసం తాగడం కూడా శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బచ్చలికూరలో ఉండే ఆక్సలేట్ కాల్షియంను తొలగించి, మూత్రపిండాలపై ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి పాలకూరతో తయారు చేసిన రసాలు తాగకపోవడం చాలా మంచిది.
బచ్చలికూరను అతిగా తీసుకోవడం:
ఈ కూరలో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయని చాలా మంది పరిమితికి మించి వినియోగిస్తారు. ఇలా వినియోగించడం కూడా చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Side Effects Of Spinach: బచ్చలికూరతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఏంటి నమ్మట్లేదా?