Flax Seeds Ladoo with jaggery Recipe: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ప్రతిరోజు అవిసె గింజలను ఆహారాల్లో తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా అవ్వడమే కాకుండా జుట్టు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే పోషక గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. అందుకే మన పూర్వీకులు వీటిని వేయించి, వివిధ రకాల ఆహార పదార్థాల్లో వినియోగించేవారు. అయితే వీటితో తయారుచేసిన లడ్డూలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇందులో ఉండే పోషక గుణాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే అవిసె గింజలతో లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పు అవిసె గింజలు
ఒక కప్పు పల్లీలు
ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి
రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు
అర కప్పు గోధుమపిండి
టీ స్పూన్ల నెయ్యి
ఐదు యాలకులు
కావలసినన్ని డ్రై ఫ్రూట్స్
ఒకటిన్నర కప్పు బెల్లం తురుము
తయారీ పద్ధతి:
ఈ లడ్డును తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో అవిసె గింజలు వేసుకొని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో పల్లీలు వేసి వాటిని కూడా రంగు మారేంతవరకు వేయించుకోవాలి. ఎంచుకున్న తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకొని కొబ్బరి తురుము వేసుకొని, దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరోసారి పెట్టుకుని అందులో తగినంత నెయ్యి వేసుకొని, వేడి అయ్యాక గోధుమ పిండిని వేసుకొని బాగా కలపాలి. కమ్మని వాసన వచ్చిన తర్వాత ఈ పిండిని పక్కన తీసి పెట్టుకోవాలి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఆ తర్వాత ఓ మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో అవిసె గింజలు, పల్లీలు, కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ పొడిని తీసుకొని పక్కన పెట్టుకొని అదే జారులు బెల్లాన్ని వేసి బాగా మిక్సీ కొట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఓ పెద్ద బౌల్ తీసుకొని అందులో పక్కన పెట్టుకున్న పొడులన్నిటినీ వేసి, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కావలసినంత నెయ్యి వేస్తూ మిక్స్ చేయాల్సి ఉంటుంది. మిక్స్ చేసిన తర్వాత లడ్డూల చిన్న చిన్న ముద్దలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండినంత ముద్దలుగా చుట్టుకొని లడ్డూల్లా తయారు చేసుకోవాలి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Flax Seeds Ladoo: రోజు ఒక ఈ లడ్డుని తింటే.. ఎంత పెద్ద రోగమైన నయం కావాల్సిందే..