Neem Water Benefits: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల చర్మంపై చాలా సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్ లభించే ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వేప చెట్టు సంబంధించి ఉత్పత్తులను వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉండే గణాలు చర్మంపై అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
వేపతో తయారు చేసిన నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మపై అలర్జీ దూరం చేస్తుంది:
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడానికి సహాయపడతాయి. దీనితో రోజూ ముఖాన్నిశుభ్రం చేసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దద్దుర్లు, దురదలు మొదలైన సమస్యల దూరం చేస్తుంది.
మొటిమలు దూరమవుతాయి:
వేపతో తయారు చేసిన నీరుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇది చర్మంపై ఉండే మురికిని, నూనెను శుభ్రపరచడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కావున మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు తక్రమం తప్పకుండా ఈ వేప నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి
జిడ్డు, పొడి చర్మానికి చికిత్స కలిగిస్తుంది:
వేపలో చాలా మందిలో ముఖంపై చర్మం జిడ్డు, పొడిబారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వేపను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీసెప్టిక్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook