Belly Fat Reasons: బెల్లీఫ్యాట్‌ ఎందుకొస్తుంది, తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.

Belly Fat Reasons: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ నిర్మూలనకు విఫలయత్నాలు చేస్తుంటారు. బెల్లీ ఫ్యాట్‌పై జరిపిన అధ్యయనాల్లో ఆసక్తి కల్గించే విషయాల బయటపడ్డాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2022, 08:16 PM IST
Belly Fat Reasons: బెల్లీఫ్యాట్‌ ఎందుకొస్తుంది, తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.

Belly Fat Reasons: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ నిర్మూలనకు విఫలయత్నాలు చేస్తుంటారు. బెల్లీ ఫ్యాట్‌పై జరిపిన అధ్యయనాల్లో ఆసక్తి కల్గించే విషయాల బయటపడ్డాయి.

ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా బెల్లీ ఫ్యాట్ సమస్య పెరుగుతోంది. పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వుతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెల్లీ ఫ్యాట్ అనేది మీ ఫిట్నెస్‌ను, మీ లుక్‌ను పాడు చేస్తుంది. జీన్స్ వంటి మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ నుంచి విముక్తి పొందడం అంత సులభమేం కాదు. మీరు కూడా బెల్లీఫ్యాట్‌తో బాధపడుతుంటే..ఇక నుంచి ఏ సమస్యా ఉండదు. ఎందుకంటే..తాజాగా జరిపిన వివిధ అధ్యయనాల్లో బెల్లీఫ్యాట్‌కు కారణమయ్యే ఐదు ముఖ్యమైన కారణాలు తెలిశాయి. 

బెల్లీ ఫ్యాట్ కారణాలు

ఆకలిని తగ్గించడం, ఎక్కువ తినకుండా నియంత్రించడంలో ప్రోటీన్లు ఉపయోగపడతాయి. 30 శాతం కేలరీల ప్రోటీన్ సేవనం..బరువు తగ్గించేందుకు మంచిది. అంతేకాదు..మీ శరీరం మెటబోలిక్ రేట్ పెంచుతుంది. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. దీనికోసం బ్రేక్‌ఫాస్ట్‌లో స్ప్రౌట్స్ సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రోటీన్లు తక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. 

లివర్ పనితీరు

లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే చాలా రకాల రోగాలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా..బెల్లీ ఫ్యాట్‌కు దారి తీస్తుంది. అందుకో వారంలో ఒకసారి లివర్‌ను డీటాక్స్ చేయడం చాలా అవసరం. లేకపోతే బెల్లీఫ్యాట్ సమస్య ఎదురౌతుంది. 

సరైన నిద్ర

రోజుకు కనీసం 7-8 గంటలు ఆటంకం లేకుండా నిద్ర ఉండాలి. అలా కాకుండా నిద్ర సరిపోకపోతే..బెల్లీ ఫ్యాట్ సమస్య పొంచి ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టకపోతే..క్యామోమైల్ టీలో కొద్దిగా దాల్చినచెక్క పౌడర్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. రాత్రి నిద్రపోయేముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే బెల్లీఫ్యాట్‌కు దారితీస్తుంది. 

Also read: Skin Care Tips: రోజూ అందంగా, మెరుస్తూ కన్పించాలంటే..ఇది రాయండి చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News