Buttermilk Benefits : మజ్జిగతో ఇన్ని లాభాలా..బరువు తగ్గేందుకు అద్భుతమైన చిట్కాలు

Buttermilk Benefits : చక్కని ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కా పెరుగు లేదా మజ్జిగ. వేసవిలో అయితే మజ్జిగకు మించిన ప్రత్యామ్నాయం లేదనే అంటారు వైద్యులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2022, 11:38 AM IST
Buttermilk Benefits : మజ్జిగతో ఇన్ని లాభాలా..బరువు తగ్గేందుకు అద్భుతమైన చిట్కాలు

Buttermilk Benefits: చక్కని ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కా పెరుగు లేదా మజ్జిగ. వేసవిలో అయితే మజ్జిగకు మించిన ప్రత్యామ్నాయం లేదనే అంటారు వైద్యులు.

రోజూ భోజనంతో పాటు కాసింత పెరుగన్నం తినడం లేదా భోజనానంతరం మజ్జిగ తాగడం చాలామందికి అలవాటే. నాలుగు మెతుకులు పెరుగన్నం తినకపోతే భోజనం అసంపూర్తిగా ఉంటుందేనేది పెద్దలు చెప్పే మాట. అదే అలవాటు అనాదిగా వస్తోంది. ఇది కేవలం అలవాటే కాదు మెరుగైన ఆరోగ్య రహస్యం కూడా. పెరుగన్నం తీసుకోకపోతే..పల్చని మజ్జిగ తాగడం చాలా మంచిదంటారు వైద్య నిపుణులు. అదే సమయంలో మజ్జిగను ఓ పద్దతిలో తయారుచేసుకుని రోజూ సేవిస్తే బరువు కూడా తగ్గుతారు. అదెలాగో పరిశీలిద్దాం.

ముందుగా పల్చగా మజ్జిగ చేసుకోవాలి. అందులో జీలకర్ర పొడి కాస్త వేసి..మిరియాల పొడి కొద్దిగా కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి నూరి ఈ మజ్జిగలో కలుపుకుని తాగితే రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. ఈ మజ్జిగలో కొన్ని మునగ ఆకులు కూడా వేస్తే కీళ్లనొప్పుల్నించి ఉపశమనం లభిస్తుంది. మజ్దిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్స్, లాక్టోస్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలుంటాయి. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ మజ్జిగ తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ తగ్గించే ప్రత్యేక జీవాణువులు మజ్జిగలో ఉన్నాయని బ్రిటీషు మెడికల్ జర్నల్ చెబుతోంది.

మజ్జిగ క్రమ తప్పకుండా తీసుకుంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఎసిడిటీని తగ్గించి ఎముకలకు బలం చేకూరుస్తుంది. క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. మజ్జిగలో తక్కువ మొత్తంలో ఉండే కొవ్వు దీనికి కారణం. ఇది ఫ్యాట్ బర్నర్‌గా పనిచేయడం వల్ల బరువు తగ్గుతారు. మజ్జిగలో ఉండే ప్రో బయోటిక్ అంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నివారించడంతో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉండదు. మజ్జిగలో ఉండే విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం శోషణను సరళం చేస్తుంది. ఖాళీ కడుపుతో రోజూ మజ్జిగ తీసుకుంటే ఆస్టియో పొరోసిస్ రిస్క్ తగ్గుతుంది. 

Also read: Best Breakfast: బరువు తగ్గించేందుకు దోహదపడే రుచికరమైన ఐదు అల్పాహారాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News