Winter Home Remedies: చలికాలంలో జలుబు, దగ్గు ఇతర చర్మ వ్యాధులు రావడం సర్వసాధరణం. వాతావరణంలో చలి తీవ్ర పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కొంత పరిమాణంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ రోగ నిరోధ శక్తి పెరడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఎలాంటి ఆయుర్వేద పద్ధతులను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఇలా చేయండి:
అల్లం డికాక్షన్:
అల్లం డికాక్షన్ శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు జలుబు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అల్లం టీని ప్రతి రోజూ తాగడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి లాభిస్తాయి. దీంతో శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
ఎలా చేయాలి:
అల్లం డికాక్షన్ చేయడానికి.. ముందుగా రెండు గ్లాసుల నీటిని మరిగించి.. అందులో అల్లం, నల్ల మిరియాలు, పసుపు, తులసి ఆకులను వేసి ఒక్క గ్లాసు అయ్యే దాకా మరిగించండి. అయితే ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నల్ల మిరియాలు, లవంగం కషాయాలను:
దగ్గు, జలుబు ఇతర అనారోగ్య సమస్యల నుంచి నల్ల మిరియాల కషయం ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ కషాయం ఎలా చేయాలి:
నల్ల మిరియాలు, లవంగాల డికాక్షన్ చేయడానికి.. ముందుగా నీటిని మరిగించి, దానిలో నల్ల మిరియాలు, యాలకులు, టీ ఆకులు, అల్లం, బెల్లం, తులసి ఆకులను వేసి మరిగించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా
Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.