International Womens Day: సకల మానవాళి సృష్టికి కారణమైన మహిళకు గౌరవంగా స్మరించుకునే రోజు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చ్ 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ధరించే డ్రెస్ కలర్ ద్వారా వివిధ రకాల సంకేతాలివ్వచ్చని మీలో ఎంతమందికి తెలుసు.
మార్చ్ 8వ తేదీ. ప్రతియేటా ఇదే రోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటారు. లింగ సమానత్వాన్ని గౌరవించేందుకు, ప్రోత్సహించేందుకు, మహిళకు గౌరవంగా స్మరించుకునేందుకే ఈ రోజు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎక్కడ ఎలా జరుపుకున్నా మహిళకు గౌరవం ఇవ్వడమే ప్రధాన ఉద్దేశ్యం. అదే సమయంలో వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా మీరు ధరించే దుస్తుల ద్వారా, కలర్స్ ద్వారా కొన్ని సందేశాన్ని, సంకేతాల్ని సమాజానికి చాటిచెప్పవచ్చు. అవేంటో చూద్దాం.
స్త్రీ వాదానికి సంకేతంగా టీ షర్ట్స్
ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రబల్ గురుంగ్ ది ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్ క్వొటేషన్‌తో వైట్ కలర్ టీ షర్ట్ 2017లో డిజైన్ చేశాడు. ప్రముఖ మోడల్స్ ర్యాంప్ వాక్‌లో ఇదే టీ షర్ట్ ధరించారు. స్త్రీ వాద ఉద్యమానికి సంకేతంగా ఈ టీ షర్ట్ ధరించవచ్చు.
రంగును బట్టి లక్ష్యం
సఫ్రాగిఫ్ట్ ఉద్యమంతో వివిధ రంగులు వివిధ లక్ష్యాల్ని సూచిస్తాయని తెలిసింది. 1908లో యునైటెడ్ కింగ్ డమ్‌లోని విమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ నుంచి ఉద్భవించిన రంగు ఊదా రంగు. పర్పుల్ రంగు న్యాయాన్ని సూచిస్తే..ఆకుపచ్చ రంగు ఆశను సూచిస్తుంది. ఇక తెలుపు ఎప్పటిలానే స్వచ్ఛతకు సంకేతమిస్తుంది. ఊదారంగు స్త్రీవాదపు తత్వాన్ని బోధిస్తుంది. ఏది ధరించినా..స్త్రీ వాదపు క్యాప్షన్ ఉండేట్టు చూసుకోవాలి. ఉద్యమస్త్రీగా తెల్లటి భారతీయ సాంప్రదాయ చీరల్ని కూడా ధరించవచ్చు. ఇటీవల విడుదలైన గంగూబాయి కఠియావాడి సినిమాలో అలియా భట్ తెల్లటి చీరలో కన్పిస్తుంది అందుకే.
ఇక సాధారణ దుస్తులతోనే సౌకర్యవంతంగా రాజకీయపరంగా ఉండాలనుకుంటే మాత్రం వైల్డ్‌ఫాంగ్ ఫెమినిస్ట్ ఫ్లీస్ ధరించాలట. స్త్రీల నేతృత్వంలో నడిచే కంపెనీల ఆభరణాల్ని ప్రత్యేకించి ధరించడం ద్వారా స్త్రీ వాదతత్వాన్ని పంపించవచ్చు. ఫెమ్మీ నెక్లెస్ అనేది స్త్రీ సౌందర్యాన్ని వ్యక్తపరుస్తూనే, గౌరవాన్ని సూచిస్తుంది.
Also read: Skin Care Tips: వేసవిలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఏం వాడకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.