Beetroot idli recipe: ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఏంటిదంటే ఇడ్లీ అని మొదటగా చెప్పుకుంటాం. అయితే ఇడ్లీని తక్కువగా తినే వాళ్ళు ఉంటారు, దోస పూరి ఇలాంటివి వారు డైట్ లో చేర్చుకుంటారు .దోసెలో రైస్ ఉంటుంది. ఇక పూరి నూనెలో వేయించుకో తప్పదు అందులో ఫ్యాట్ ఉంటుంది. అయితే ఇడ్లినే డిఫరెంట్ గా ఈసారి బీట్రూట్ తో తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్య కరం ఈ పింక్ కలర్ లో ఉండే ఇడ్లీ కేవలం 30 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన ఇడ్లీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
సాధారణంగా బీట్రూట్లో లో క్యాలరీలు ఉంటాయి ఇందులో పొటాషియం విటమిన్ ఏ ఐరన్ అండ్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సౌత్ ఇండియన్ లో ఫేమస్ ఇడ్లీలు బ్రేక్ ఫాస్ట్ లోనే కాదు డిన్నర్ లంచ్ లో కూడా తినేవాళ్ళు ఉన్నారు. బీట్రూట్ తో తయారు చేసిన ఇడ్లీకి కోకోనట్ చట్నీ తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఇదీ చదవండి:ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్ చేసినట్లు మెరిసిపోతుంది..
కావలసిన పదార్థాలు..
ఇడ్లీ రవ్వ- రెండు కప్పులు
బీట్రూట్-1
పెరుగు- ఒక కప్పు
నీళ్లు- సరిపోయినంత
ఉప్పు రుచికి సరిపడా
ఇదీ చదవండి: కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉండాలంటే ఈ ట్రిక్ పాటించండి..
బీట్రూట్ ఇడ్లీ తయారీ విధానం..
ఒక బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ బాగా కడిగి పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా స్మూత్ ఇడ్లీ ఇడ్లీ పిండిలా కలుపుకొని తయారు చేసుకోవాలి. దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ తొక్క తీసి చిన్న పీసులుగా కట్ చేసుకుని ఒక బ్లెండర్ లో వేసి స్మూత్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ పేస్టుని ఇడ్లీ బ్యాటర్ లో వేసుకొని కావాలంటే నీరు కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ ని తీసుకొని ఆ ప్లేట్లకు ఆయిల్ రుద్దుకోవాలి. ఇప్పుడు అందులో ఇడ్లీలు పోసుకోవాలి దీనికి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వీటిని బాగా ఉడికిన తర్వాత ఈ వేడి వేడి ఇడ్లీలు రెడీగా ఉంటాయి దీని సాంబార్ కొబ్బరి చట్నీతో తింటే ఎంతో అద్భుతం ఆరోగ్యకరం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook