Cucumber Face Mask: మొటిమలకు ఖరీదైన ప్రోడక్ట్స్‌ ఎందుకు..? దోసకాయ ఫేస్‌ మాస్క్‌ ఉండగా!

How To Make Cucumber Face Mask: దోసకాయ ఫేస్‌ మాస్క్‌ను ముఖానికి క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 01:53 PM IST
Cucumber Face Mask: మొటిమలకు ఖరీదైన ప్రోడక్ట్స్‌ ఎందుకు..? దోసకాయ ఫేస్‌ మాస్క్‌ ఉండగా!

How To Make Cucumber Face Mask: దోసకాయలో సగం కంటే ఎక్కువగా నీటిని కలిగి ఉంటుంది. కాబట్టి వేసవిలో వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికే కాకుండా చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దోసకాయను ముఖానికి అప్లై చేయడం వల్ల  చర్మం హైడ్రేట్‌గా మారుతుంది.

అంతేకాకుండా వేసవిలో చర్మంపై వచ్చే దద్దుర్లను సులభంగా తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దోసలో ఉండే గుణాలు  వృద్ధాప్యం కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా సంరక్షిస్తుంది. అయితే ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ ఫేస్‌ ప్యాక్‌ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  1. 3 స్పూన్ల ముల్తానీ మిట్టి 
  2. 1 దోసకాయ 
  3. 4 స్పూన్ల రోజ్ వాటర్ 

దోసకాయ ఫేస్ ప్యాక్ తయారి విధానం:

  1. ఈ ఫేస్‌ ఫ్యాక్‌ తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
  2. ఆ గిన్నెలో  1 దోసకాయను మిశ్రమంలా తయారు చేసుకుని వేసుకోవాలి.
  3. ఇలా వేసుకున్న తర్వాత..అదే గిన్నెలో 3 చెంచాల ముల్తానీ మిట్టి వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.
  4. ఇదే గిన్నెలో 4 స్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.
  5. ఇలా అన్ని మిశ్రమాలను బాగా కలిపి ఓ గాజు బాటిల్‌ భద్ర పరుచుకోవాలి. 
  6. అంతే సులభంగా దోసకాయ ఫేస్ ప్యాక్ తయారైనట్లే..

Also Read: Chia Seeds For Weight Loss: కాఫీలో చియా విత్తనాలు కలుపుకుని తాగితే వేగంగా బరువు తగ్గడం ఖాయం!

ఫేస్ ప్యాక్ అప్లై విధానం:

  1. దోసకాయ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసే ముందు..ఫేస్‌ను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
  2. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ను తీసుకుని మెడ, ఫేస్‌పై బాగా అప్లై చేయాలి.
  3. ఇలా అప్లై చేసిన తర్వాత 4 నిమిషాల పాటు బాగా మసాజ్‌ చేయాలి. 
  4. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి.
  5. ఇలా క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది.
  6. ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను క్రమం తప్పకుండా వినియోగిస్తే చర్మంపై దద్దుర్లు క్రమంగా తొలగిపోతాయి. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News