Salt: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి..?

Health Benefits Of Salt: ఉప్పు ఆహారంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇది కేవలం ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యంపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పు తినడం వల్ల కలిగే లాభాలు.. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలా నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Nov 6, 2024, 10:53 AM IST
Salt: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి..?

Health Benefits Of Salt: ఉప్పు అనేది మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆహారానికి రుచిని ఇచ్చే అంశంగా మాత్రమే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఉప్పులో అత్యధికంగా ఉండే రసాయనం సోడియం క్లోరైడ్. ఉప్పు తినడం వల్ల శరీరంలో నీటిని నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా ఇది కండరాలు, నరాలు చురుకుగా పనిచేయడంలో కీలక ప్రాత పోషిస్తాయి. సరైన మోతాదులో ఉప్పు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఉప్పు (సోడియం) మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం. ఉప్పు ఆహారంలో కలిపి తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా సహయపడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఉప్పు ఆరోగ్యకరమైనప్పటికి అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కలుగుతాయి. 

అధిక సోడియం రక్తనాళాలను సంకోచింపజేస్తుంది, దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది.  హై బ్లడ్ ప్రెషర్ గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.  మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచి, మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. అధిక సోడియం శరీరంలోని కాల్షియంను తొలగించి, ఎముకలను బలహీనపరుస్తుంది.  శరీరంలో నీటిని నిలుపుకోవడానికి కారణమవుతుంది, దీని వల్ల చేతులు, కాళ్ళు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువగా ఉప్పు ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉంటుంది కాబట్టి వీటిని తినకూడదు. 

తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, గ్రెయిన్స్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. వంట చేసేటప్పుడు ఉప్పును తక్కువగా వాడండి, బదులుగా మసాలాలను ఎక్కువగా వాడండి. రిఫైన్డ్ సాల్ట్‌కు బదులుగా రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్‌ను వాడండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తమ వైద్యుల సలహా మేరకు ఉప్పు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఎంత ఉప్పు తీసుకోవాలి?

జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు: ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు.

సగటున ఒక భారతీయుడు తీసుకునే ఉప్పు: సగటున ఒక భారతీయుడు రోజుకు 30 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు.

ఉప్పు తక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుంది.  సోడియం తక్కువైతే కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.

ముఖ్యమైన విషయం: ఉప్పు మన శరీరానికి అవసరం అయినప్పటికీ, అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందుకే, ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేసిన మోతాదులోనే ఉప్పును తీసుకోవడం ముఖ్యం.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News