Jupiter Transit 2021: సెప్టెంబర్ నెలలో వృత్తి- ఆదాయాల్లో లాభదాయకం.. ఈ రాశివారిపై అధిక ప్రభావం!

జ్యోతిష్యశాస్త్రం: గురు గ్రహం సంచారంలో (గురు రాశిలో పరివర్తనం) జరిగే మార్పుల కారణంగా రాశి చక్రంలో పెద్ద మార్పులను తీసుకురానుంది. రాబోయే 15 రోజుల్లో గురు మకర రాశిలోకి ప్రవేచించటం కారణంగా, ఈ మార్పు వలన కొన్ని రాశులలో వృత్తి మరియు ఆర్థిక స్థితిలో శుభప్రదమైన సూచనలు కనిపిస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 06:52 PM IST
  • మకరరాశిలోకి ప్రవేశించనున్న గురు గ్రహం
  • కొన్ని రాశులకు ప్రతికూల ప్రభావాలు
  • ఆ రాశివారికి వృత్తి- ఆదాయాల్లో గణనీయమైన లాభాలు
Jupiter Transit 2021: సెప్టెంబర్ నెలలో వృత్తి- ఆదాయాల్లో లాభదాయకం.. ఈ రాశివారిపై అధిక ప్రభావం!

హైదరాబాద్: అతిపెద్ద గ్రహమైన బృహస్పతి విజయానికి కారకం, జాతకంలో గురు గ్రహం స్థానం బాగుంటే, ఆ వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. గురు లేదా బృహస్పతిగా పిలవబడే గ్రహం, మనపై సానుకూలత ప్రభావాలను చూపిస్తుంది కావున జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత పవిత్రమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అయితే సెప్టెంబర్ 14 న, గురుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు నవంబర్ 20 వరకు ఒకే రాశిలో ఉంటుంది. దీని ఫలితంగా అన్ని గ్రహాలపై గణనీయమైన మార్పులను చూపిస్తుంది. ఈ మార్పు అన్ని రాశుల వారి వృత్తి మరియు ఆదాయయంను ప్రభావితం చేస్తుంది. 

మేషరాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
ఈ రాశి వారికి గురు గ్రహం పరివర్తన చాలా శుభప్రదం. ఈ సమయంలో మేషరాశి వారికి వృత్తి మరియు వ్యాపారమైనపరమైన ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి. చేపట్టిన అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు. 

వృషభ రాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
ఈ 15 రోజులు వృషభ రాశి వారికి కూడా శుభప్రదమనే చెప్పాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. గురు పరివర్తనం ఈ రాశి వారిలో స్థిర ఆదాయాన్ని పెంచడమే కాకుండా, ఆదాయ వనరులను కూడా పెంచుతుంది. 

Also Read: Pfizer Vaccine Side Effect: ఫైజర్ వ్యాక్సిన్ అరుదైన సైడ్‌ఎఫెక్ట్ అది..మహిళ మృతి

మిథునంపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
గురుగ్రహంలో మార్పులు ఈ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపకపోవచ్చు. ఉద్యోగం చేసే ఈ రాశి వారికి గురుగ్రహ మార్పుల వలన సమస్యలు ఏర్పడవచ్చు. కానీ వ్యాపారవేత్తలకు ఈ మార్పు మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

కర్కాటక రాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
గురుగ్రహంలో వచ్చే ఈ మార్పుల వలన ఉద్యోగం చేసే కర్కాటక రాశి వారిపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదుచుచేసే వారికి నచ్చిన జాబ్ పొందవచ్చు. అంతేకాకుండా, వ్యాపారవేత్తలకు అనుకూలం మరియు కొత్త వ్యాపారాలు ప్రాభించే వారికి మంచి సమయమనే చెప్పాలి. 

సింహరాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
సింహా రాశి వారిపే గురుగ్రహంలో మార్పులు కొంచెం వ్యతిరేఖ ప్రభావాలను చూపవచ్చు కావున..  ఈ రాశి వారు చేపట్టే కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాగ్వాదాలకు దూరంగా ఉంటూ, సమయం గడిచే వరకు ఎదురుచూడటం మంచిది. 

కన్యరాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
ఈ రాశివారిపై గురుగ్రహంలో మార్పులు సానుకూల ప్రభావాలు చూపుతాయి.. ఈ రాశి వారి వ్యాపారంలో లాభాల భాటపడతాయి మరియు కొత్త పెట్టుబడులలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి ఉద్యోగుల పట్ల మీ అధికారి మరియు సహచరుల సంతోషం వ్యక్తం చేస్తారు. 

Also Read: India Corona Update: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఉధృతి, ఆ ఒక్క రాష్ట్రంలోనే 70 శాతం కేసులు

తులరాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
గురుగ్రహంలోని మార్పులు ఈ రాశివారిపై మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఈ రాశివారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. కానీ వ్యాపారాల్లో గట్టి ప్రయత్నాల తర్వాతే విజయం సాధిస్తారు.

వృశ్చికంపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
వృశ్చిక రాశి వారు ఈ 15 రోజులో చాలా బిజీగా ఉంటారు. అయితే మీ పెట్టుబడులకు సరైన ఫలితాలు రాకపోవచ్చు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. 

ధనుస్సుపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
గురుగ్రహంలోని మార్పు ఈ రాశివారిపై ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆదాయం మరియు ఉద్యోగ విషయాల్లో సానుకులతలు ఉంటాయి. అంతేకాకుండా ప్రమోషన్ లాంటివి పొందే అవకాశాలు ప[పుష్కలంగా ఉన్నాయి. 

Also Read: Heavy Rains Alert: ఏపీలోని ఆ ఆరు జిల్లాల్లో భారీ వర్ష సూచన

మకరంపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
ఈ 15 రోజుల సమయం మకర రాశివారు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వీలైనంత డబ్బు ఆదా చేసి, మంచి వ్యాపారాల్లో పెట్టుబదులు పెట్టడం మంచిది. 

కుంభ రాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
ఈ రాశివారికి డబ్బు సంపాదన బాగున్నప్పరికీ ఖర్చులు దాని కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రణాళిక రూపొంచుకొని ఖర్చు చేయటం మంచిది. 

మీన రాశిపై గురుగ్రహం పరివర్తన ప్రభావం...
ఈ రాశివరరికి 15 రోజులు అన్ని రకాలుగా లాభదాయంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతితో పాటు తక్కువ శ్రమతో ఎక్కువ మొత్తం అందుకునే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Paralympics: పారాలింపిక్స్‌లో అదరగొడుతున్న అథ్లెట్లు.. భారత్‌కు తొలి స్వర్ణం

గమనిక: ఈ కథనంలో తెలుపబడిన సమాచారం సాధారణ మరియు ఉహజనితం మాత్రమే..  ఈ సమాచారం జి హిందుస్థాన్ తెలుగు న్యూస్ నుండి నిర్దారించబడలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News