Foods Not For Kids: పిల్లలకు స్నాక్స్ ఇస్తున్నారా లేక విషం పెడుతున్నారా ?

Foods Not For Kids: మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ? మీ ఇంట్లో కాకపోయినా మీ తోబుట్టువులకు కానీ లేదా మీ సమీప బంధుమిత్రులకు చిన్న పిల్లలు ఉన్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే...  ఆ తరువాత ఈ విషయం తెలియని వారికి తెలియజెప్పాల్సిందే. ఇంతకీ ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారా ? ఐతే ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.

Written by - Pavan | Last Updated : Aug 22, 2023, 03:09 PM IST
  • పిల్లలు ఇష్టంగా తింటున్నారని అడ్డమైనవి పెడుతున్నారా ?
  • మీరు పెట్టేది స్లో పాయిజన్‌తో సమానం అని మీకు తెలుసా ?
  • పిల్లలకు ఎలాంటి ఫుడ్ అస్సలే పెట్టకూడదంటే..
Foods Not For Kids: పిల్లలకు స్నాక్స్ ఇస్తున్నారా లేక విషం పెడుతున్నారా ?

Foods Not For Kids: చిన్న పిల్లలకు చిన్నప్పటి నుండే హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. చిన్న పిల్లలు మారాం చేస్తున్నారు కదా అనో లేక చిన్న పిల్లలే కదా అని మీరే గారాబం చేస్తూనో ఏది పడితే అది తినడానికి ఇస్తే.. అది వారిని చిన్న వయస్సులోనే అనారోగ్యం బారినపడేలా చేస్తుంది. అంతేకాదు.. వాళ్లు చిన్నప్పుడు తిన్న చిరుతిళ్లు, జంక్ ఫుడ్ వాళ్లు పెరిగి పెద్దయి , ఒక వయస్సుకి వచ్చేసరికి వారి ఆరోగ్యం ఇంకొంత దెబ్బతినడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తినే చాలా రకాల ఫుడ్స్ వారి ఆరోగ్యంపై స్లో పాయిజన్ తరహాలో పనిచేసేవే అనే విషయం తెలుసుకోండి. లేదంటే మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే పాడు చేసిన వారు అవుతారు. అందుకే పిల్లలకు ఇలాంటి ఆహార పదార్థాలు అస్సలే వడ్డించరాదు.

షుగర్ అధికంగా ఉండే డ్రింక్స్ :
షుగర్ అధికంగా ఉండే సోడా, కూల్ డ్రింక్స్, ఎనర్జి డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు చిన్న పిల్లలకు ఇవ్వకూడదు. ఆ మాటకొస్తే ఇలాంటి డ్రింక్స్ పెద్దవారికి కూడా మంచిది కాదు. కాకపోతే చిన్న పిల్లలపై ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇవి తాగితే సమస్య ఏంటంటే.. చిన్న పిల్లలు అధిక బరువు పెరిగి స్తూలకాయం బారిన పడటంతో పాటు దంతాల్లో పుప్పి వస్తుంది. 

చాక్లెట్స్, క్యాండీస్ :
చాక్లెట్స్, క్యాండీస్ వంటి వాటిలో తీపి కోసం ఎక్కువ మోతాదులో షుగర్ వినియోగిస్తారు. అందువల్ల ఇవి ఎక్కువగా తినే చిన్న పిల్లలు అధిక బరువు పెరిగి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా చాక్లెట్స్, క్యాండీస్ ఎక్కువ తినడం వల్ల అందులోని షుగర్ వారి దంతాలను పుప్పిళ్ల బారిన పడేలా చేస్తాయి.

చిప్స్ అండ్ ఫ్రైస్ :
చిన్నపిల్లలు చాక్లెట్స్ తరువాత మళ్లీ అంత ఇష్టంగా తినేవి చిప్స్ లేదా ఫ్రైస్ లాంటి ప్రాసెస్డ్ స్నాక్స్. కానీ ఇలాంటి స్నాక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం వాటిలో యాడెడ్ ప్రిజర్వేటిస్ కలపడంతో పాటు సోడియం ఎక్కువగా దట్టిస్తారు. వీటిని నూనేలో ఫ్రై చేయడం వల్ల ఇందులో శరీరానికి అనవసరమైన ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వంటివి కూడా ఉంటాయి. ఇవి తింటే పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.

ఎక్కువసేపు ఫ్రై చేసిన ఫుడ్స్ :
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ అంటే చాలామంది చిన్న పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. కానీ ఇందులో ఉండే అన్‌హెల్తీ ఫ్యాట్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వారిని అనారోగ్యంపాలు చేస్తాయనే విషయం వారికి తెలియదు. పెద్దలు కూడా చిన్న పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ చేసిపెట్టి ఆనందపడుతుంటారు కానీ తమకే తెలియకుండా తమ చిన్నారుల ఆరోగ్యం పాడు చేస్తున్నామని అస్సలే ఊహించరు.

ఫాస్ట్ ఫుడ్ :
చాలామంది తల్లిదండ్రులు సమయాభావం వల్లనో లేక తమ పిల్లలు ఇష్టంగా తింటున్నారనే కారణం చేతనో తరచుగా వారికి ఇష్టమైన పాస్ట్ ఫుడ్ చేసి పెడుతుంటారు. కానీ నూడుల్స్ లాంటి స్నాక్స్ ఎక్కుగా మైద పిండితో తయారయ్యేవే. అవి తినడం వల్ల పౌష్టికాహార లోపం సమస్య వస్తుంది. ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అందించాలి కానీ అస్సలు ఏ మాత్రం పోషకాలే లేని ఫాస్ట్ ఫుడ్ పెట్టకూడదు. ఫాస్ట్ ఫుడ్స్‌లో పోషకాలు ఏమీ ఉండవు అనే విషయం మర్చిపోవద్దు. 

ట్రాన్స్-ఫ్యాట్స్ అధికంగా ఉండే ఫుడ్స్‌ని దూరం పెట్టండి :
బేకరి ఉత్పత్తుల్లో, వేపుళ్లలో ఈ ట్రాన్స్-ఫ్యాట్స్ అధికంగా ఉంటుంది. అందుకే వాటిని చిన్నారులకు ఎంత దూరం పెడితే అంత మంచిది అని సూచిస్తున్నారు పౌష్టికాహర నిపుణులు. 

కెఫైన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని ఇవ్వొద్దు :
కెఫైన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కానీ లేదా ఎనర్జి డ్రింక్స్ కానీ తీసుకుంటే.. అది పిల్లల్లో నిద్రలేమికి కారణం అవుతుంది. లేదంటే పడుకోవాల్సిన సమయంలో నిద్రపోకపోవడం, పడుకోకుండా మేల్కోవాల్సిన సమయంలో నిద్రపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 

ఇది కూడా చదవండి : Can Smoking Cause White Hair: స్మోకింగ్ చేస్తే తెల్ల జుట్టు వస్తుందా ?

పచ్చివి, సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలు : 
పచ్చివి, సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలు పిల్లలకు ఇవ్వకూడదు. అది వారి జీర్ణక్రియపై భారంపడేలా చేసి వారిని అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. ఉదాహరణకు కూరగాయలు, కోడి గుడ్లు, మాంసం, చేపలు వంటివి పూర్తిగా ఉడికించిన తరువాతే వడ్డించాల్సి ఉంటుంది. లేదంటే అవి చూపించే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చిన్న పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)

ఇది కూడా చదవండి : Calcium Rich Foods: క్యాల్షియం లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు.. క్యాల్షియం అధిక మోతాదులో ఉండే ఫుడ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook .

Trending News