Summer Tourist Spots: గోవాలో చాలామందికి తెలియని ఎంతో అందమైన ప్రదేశాలు ఇవే

GOA Tour Tourism Spots Planning Trips: గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి చాలామందిని ఒక సందేహం వెంటాడుతుంటుంది. గోవా టూర్‌లో ఏయే టూరిజం స్పాట్స్ కవర్ చేస్తే బాగుంటుంది.. ఎక్కడెక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనే మీమాంసలోనే తెలిసినవి ఏవో చూసి వచ్చేస్తుంటారు. కానీ అలా చేస్తే గోవా టూర్ అసంపూర్తిగానే మిగిలిపోతుంది.

Written by - Pavan | Last Updated : May 30, 2023, 02:13 PM IST
Summer Tourist Spots: గోవాలో చాలామందికి తెలియని ఎంతో అందమైన ప్రదేశాలు ఇవే

Summer Tourist Spots: గోవా వెళ్లాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ గోవాలో ఏమేం టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి.. తప్పకుండా వీక్షించాల్సిన ప్రదేశాలు ఏమేం ఉన్నాయి అనే వివరాలు తెలియక తాము ఉన్న చోటుకు సమీపంలో ఉన్నవో .. లేక తమ బడ్జెట్ కి అందుబాటులో ఉన్నవో చూసి, అదే గోవా ట్రిప్ అనుకుని వచ్చేస్తుంటారు. తీరా గోవా టూర్ ముగించుకుని వచ్చాకా.. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫలానా ప్రదేశం చూశారా అని అడిగినప్పుడు అరెరె అది చూడలేకపోయామే అని మదనపడుతుంటారు. గోవా టూర్ ప్రియులకు అలాంటి అనుభవం ఎదురుకాకుండా ఉండాలంటే.. ఇదిగో గోవా వెళ్లడానికంటే ముందుగానే అక్కడ తప్పకుండా చూడదగిన ప్రదేశాలు ఏమేం ఉన్నాయో తెలుసుకుంటే గోవా ట్రిప్ ఒక కంప్లీట్ ట్రిప్ అవుతుంది.. లేదంటే ఇన్‌కంప్లీట్ టూర్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రండి గోవాలో ఎంజాయ్ చేయదగిన ప్రదేశాల్లో అలా చక్కర్లు కొట్టేసొద్దాం.

గోవా వెళ్లే వారిలో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ప్రదేశం బటర్‌ఫ్లై బీచ్.. చాలా మందికి దీని గురించి తెలియకపోవడానికి కారణం మిగితా వాటితో పోల్చుకుంటే ఇది ఒక మారుమూల ప్రాంతంలో ఉండటమే. గోవా టూరిజంలో ఇదొక స్టన్నింగ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. 

పాండవ గుహలు
అర్వలెం కేవ్స్.. వీటినే పాండవ గుహలు అని కూడా అంటారు. ఆ పేరు రావడానికి కారణం పాండవులు ఇక్కడే ఉంటూ ఇక్కడున్న శివ లింగాలను పూజిస్తూ ఆ పరమ శివుడికి తపస్సు చేసుకునే వారు అని ఇతిహాసాలు చెబుతున్నాయి. 

కారంబోలిమ్ లేక్
గోవా టూరిజం అనే మణిహారంలో కారంబోలిమ్ లేక్ ఒక మణిపూస. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింపచేస్తుంటాయి. కారంబోలిమ్ లేక్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకోవడంతో పాటు తమని తాము మైమరిచిపోయేలా చేస్తుంటుంది.

కాకోలెం బీచ్
కాకోలెం బీచ్ నే టైగర్ బీచ్ అని కూడా అంటారు. విస్తీర్ణం పరంగా  కాకోలెం బీచ్ ఒక చిన్న బీచ్. అడవిలో ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ చిన్న బీచ్ కి చేరుకోవడం అనేది కష్టం. కానీ ఒక్కసారి అక్కడికి చేరుకున్నాం అంటే.. అప్పటి వరకు పడిన కష్టం అంతా మైమరిచిపోతుంటారు. గోవాలో ఉన్న రహస్యమైన బీచ్ లలో ఇది కూడా ఒకటి.

హర్వలెం బీచ్
గోవాలో ఉన్న అతి సుందరమైన వాటర్ ఫాల్స్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దూద్ సాగర్ తరహాలోనే పాల నురగలాంటి జలపాతాలు ఇక్కడి పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. 

హోలంట్ బీచ్
గోవాలో దాగి ఉన్న ప్రకృతి అందాల్లో హోలంట్ బీచ్ కూడా ఒకటి. ఈత కొట్టే సరదా ఉన్న వారికి.. బీచ్ ఒడ్డున నీళ్లలో నడిచే సరదా ఉన్న వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ ప్లేస్ అని చెబుతుంటారు.  
 
నేత్రావళి ( బబ్లింగ్ లేక్ )
గోవా పర్యటనలో ఎక్స్ట్రార్డినరి ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే.. మీ పర్యాటక ప్రదేశాల జాబితాలో నేత్రావళి కచ్చితంగా ఉండి తీరాల్సిందే. నేత్రావళిలోని బబ్లింగ్ లేక్ ఇప్పటికీ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక అంతుచిక్కని రహస్యమేనట. 

ఆర్ లేడీ ఆఫ్ ది మౌంట్
ఆర్ లేడీ ఆఫ్ ది మౌంట్ అనే చర్చి ఇక్కడి ఆర్కిటెక్చర్‌కి పెట్టింది పేరు. ఈ కట్టడం ఇంత అందంగా ఉంటుందా అనేది మాటల్లో చెప్పడం కంటే ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా పౌర్ణమినాడు ఈ చర్చి అందాలు చూడ్డానికి జనం భారీ సంఖ్యలో ఎగబడుతుంటారు. 

చోర్లా ఘాట్స్..
అడవిలోని అందాలను వెదుక్కుంటూ వెళ్లే అడ్వెంచర్ లవర్స్‌కి చోర్లా ఘాట్స్ రైట్ ఛాయిస్. ఇక్కడి కొండకోనల మధ్య ప్రకృతి విహారం పర్యాటకులకు స్వర్గంలా కనిపిస్తుంది.

గోవా వెళ్లే వారికి సరే కానీ వెళ్లిన వారు తెలుసుకుని ఏం చేస్తారు కనుక అనే సందేహం రావొచ్చునేమో.. మరేం లేదు.. ఈసారి గోవా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఈ ప్రదేశాలు కూడా తమ జాబితాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు కదా.. అందుకే. అదండీ గోవాలో చాలామందికి తెలియని అందమైన ప్రదేశాల జాబితా డీటేల్స్.. మరోసారి మరో అందమైన టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసుకుందాం.

Trending News