Eggs And Heart Disease: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ ఉంది. అయితే గుండె పోటు సమస్యలతో బాధపడేవారికి చాలా విషయాల్లో గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారాల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం లేదు. విచ్చల విడిగా వారికి నచ్చి ఆహారాలు తింటున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది గుండె పోటు సమస్యలతో బాధపడేవారు గుండ్లు విచ్చల విడిగా తింటున్నారు. ఇలా తినడం వల్ల శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుండె పోటుతో బాధపడుతున్నవారు గుండ్లను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. అయితే గుడ్లలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు కూడా లభిస్తాయి. కాబట్టి వీటిని గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తింటే గుండె జబ్బుల తీవ్ర తరంగా మారే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే గుండె పోటు ఉన్నవారు వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గుండె సమస్యలున్న వారు గుడ్లను ఆహారంలో తీసుకుంటే స్ట్రోక్‌లు, కంటికి సంబంధించిన చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ క్రమంలో తీవ్రమైన కంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ వ్యాధిని మాక్యులార్ డీజెనరేషన్ అని పిలుస్తారు. దీని బారిన పడితే కంటి చూపు మొత్తానికే తొలగిపోయే అవకాశాలున్నాయి.
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. 24 గంటల్లో ఒక గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి లేదా గుండె జబ్బులు పెరగవు. కానీ గుడ్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డులో కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి గుడ్డులో పచ్చ సొనకు బదులుగా గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు తప్పకుండా తెల్లసొననే ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Ind Vs SL: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!
Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి