Diabetes Control In 10 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అనేది పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా దీని కారణంగా గుండె జబ్బులు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో కిడ్నీ సంబంధిత జబ్బులు, కాళ్లలో విపరీతమైన నొప్పులు, మోకాళ్లలో నడవరాకుండా సమస్యలు వంటివి వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు చాలా మందిలో పాదాల్లో స్పర్శలేకపోవడం, నొప్పులు రావడం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. పలువురు ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో చిట్కాల వల్ల కూడా ఇలాంటి సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా సులభంగా నొప్పులను నియంత్రించుకోండి:
1. బ్లడ్‌లో షుగర్‌ను నియంత్రిస్తుంది:
డయాబెటిక్ వ్యాధితో భాదపడుతున్న వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే పలు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యాధిని నియంత్రించేందుకు పలు రకాల చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా తీసుకుని ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పని సరిగా చేసుకోవాలి. అంతేకాకుండా రోజూ ఉదయం వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉండే అవకాశాలున్నాయి. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
2. ఫిట్‌నెస్ పెంచుకోండి:
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీర సమస్యలన్ని దూరమవుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ప్రతి రోజూ వర్కవుట్స్ చేయడం వల్ల పాదాల నొప్పుల నుంచి విముక్తి కలిగే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే.. రక్తంలో చక్కెర పరిమాణం తగ్గడమే కాకుండా బరువుపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. కావున బరువును నియంత్రించలనుకునే వారు తప్పకుండా ప్రతి రోజూ వ్యాయమం, యోగా చేయండి. త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
3. వేడి నీటిని వినియోగించండి:
పాదాలలో నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి గోరువెచ్చని నీరు ప్రభావవంతంగా సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా గోరువెచ్చని నీరుని వినియోగించి పాదాలను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
4. వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలు:
పాదాలలో విపరీతమైన నొప్పిని కలిగి ఉంటే.. మీరు తప్పని సరిగా క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. అంతేకాకుండా పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించుకోండి. ఇలా చేయడం వల్ల పాదాల సమస్య దూరమవుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Shyja Moustache: మీసమున్న మహిళ.. 'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..
Also read:Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అందుకే.. అసలు విషయం చెప్పేశారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook