Curd Benefits: పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. చాలా మంది ఉదయాన్నో, రాత్రిపూటనో తప్పకుండా ఒక్కసారైనా పెరుగుతో అన్నం తింటూ ఉంటారు. అయితే మన తరానికి పెరుగు మాత్రమే తెలుసు కానీ భారతదేశంలో చాలా ఏళ్ల క్రితం గ్రామాల్లో ఎర్ర రంగు పెరుగు కూడా తయారు చేసేవారు. ఈ ఎర్రటి పెరుగు తెల్ల పెరుగు కంటే చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని చపాతీతో తింటే శరీరం దృఢంగా మారుతుందని ఆయుర్వేదం శాస్త్రంలో పేర్కొన్నారు.
తెల్ల పెరుగు తయారు చేయడం కంటే ఎర్ర పెరుగు తయారు చేయడం కష్టం. దీని తయారి కోసం ఎక్కువ మొత్తంలో శ్రమపడాల్సి ఉంటుందని చాలా పుస్తకాల్లో పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలా తక్కువ ఇళ్లలో ఎర్ర పెరుగు తయారు చేస్తున్నారు. ఈ పెరుగును తయారు చేయడానికి, పాలు తక్కువ మంటపై 8 నుండి 10 గంటల పాటు మారిగిస్తారు.
ఈ పెరుగు తయారి కోసం బరోసిని ఉపయోగిస్తారు. బరోసిలో పాలను మరిగించే ప్రక్రియను దూద్ ఒటానా అంటారు. ఈ పాలను 8 నుంచి 10 గంటలు ఉడికించినప్పుడు, పాల యొక్క లక్షణాలలో మార్పు జరుగుతుంది. అప్పుడు ఈ పాలను చల్లార్చితే ఎర్ర పెరుగులా మారుతుంది. ఈ పెరుగు తెల్ల పెరుగు కంటే చాలా పోషకమైనదిగా ఉంటుంది.
ఇలా పెరుగును తినడం మంచిది కాదు:
ఆయుర్వేదం ప్రకారం..తెల్ల పెరుగును భోజనం చేసే క్రమంలో తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ పెరుగును ఉప్పుతో కలిపి తీసుకోవడం చాలా ప్రమాదమని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. దీనిని క్రమం తప్పకుండా తింటే..జీర్ణక్రియ చెడిపోయి. చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
పెరుగును ఇలా తినొచ్చు:
- పెరుగులో ఎప్పుడూ పంచదార, బెల్లం కలిపి తినాలి.
- పెరుగును ఉదయం అల్పాహారం తర్వాత, భోజనానికి ముందు చక్కెరతో తినవచ్చు.
- పెరుగుతో చేసిన ఫ్రూట్ రైతా కూడా తినవచ్చు.
- తెల్ల పెరుగుతో చేసిన రైతా చర్మంపై తెల్లటి మచ్చలను తొలగిస్తుంది.
- పెరుగును అన్నంలో తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: Weight loss Tips: బరువు తగ్గలనుకుంటున్నారా..రాత్రి పూట ఈ పనులు చేయండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.