Uric Acid: కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఈ నీటితో 2 రోజుల్లో చెక్‌!

Cinnamon Water In Uric Acid: గౌట్ నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాల్చిన చెక్క నీటిని తాగాల్సి ఉంటుంది. దీనిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 11:24 AM IST
 Uric Acid: కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఈ నీటితో 2 రోజుల్లో చెక్‌!

Cinnamon Water In Uric Acid: దాల్చిన చెక్క ఎంతో సువాసనతో ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల రుచిగా మారుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు ఆహారాల రుచిని పెంచడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఔషధ గుణాలు కలిగిన నీటిని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలో ప్యూరిన్ స్థాయిలను నియంత్రించి యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ నుంచి వచ్చే వ్యర్థల ఉత్పత్తిను కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జీవక్రియ రేటును పెంచి శరీరంలో పేరుకుపోయి యూరిక్ యాసిడ్‌ వల్ల వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గౌట్ నొప్పులకు మేలు చేస్తుంది:
గౌట్ సమస్యలో బాధపడేవారికి కూడా దాల్చిన చెక్క నీరు  ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గౌట్ సమస్యను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. గౌట్‌ సమస్యల కారణంగా వచ్చే నొప్పులను, మంటల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట దాల్చిన చెక్కతో తయారు చేసిన నీటిని తాగాల్సి ఉంటుంది.

గౌట్ వచ్చే ముందు కనిపించే సంకేతాలు:
జుట్టులో చెమట పట్టడం అనేది ఈ ప్రధాన వ్యాధికి సంకేతం.. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్కను గ్రైండ్ చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఈ నీటిని ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరాని చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News