Bay Leaves For High Cholesterol: బే ఆకులు వంటకాల రుచి పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. బే ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది చర్మం సమస్యల నుంచి జుట్టు వరకు శరీరంలో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమానాన్ని కలిగిస్తుంది. అయితే వీటిని నీటిలో ఉడక బెట్టుకొని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఔషధ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
బే ఆకులలో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఈ ఆకుల్లో ఖనిజాలు, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ ఆకులను నీటిలో ఉడబెట్టుకుని తాగడం వల్ల సులభంగా ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఈ వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది:
ప్రతి రోజూ ఉదయాన్నే ఉడకబెట్టిన ఈ ఆకు నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు మధుమేహాన్ని సులభంగా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గించి.. అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బే ఆకులను ఎలా ఉపయోగించాలి:
ముందుగా బే ఆకులను నీటిని తయారు చేయడానికి..ఒక గ్లాసు నీటిలో 3 నుండి 4 బే ఆకులను వేసి నీరు సగం వరకు ఉడకబెట్టండి. ఇలా ఉడికిన నీటిని ఫిల్టర్ చేసి చల్లారాకా అందులో నిమ్మకాయ రసం వేసి, తేనెను కలిపి ప్రతి రోజూ ఉదయం తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?
Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook