పోలీసుల సహాయం అందకపోవడంతో... ఈవ్‌టీజర్‌ని చితకబాదిన యువతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఓ 23 ఏళ్ల యువతి ఆటో కోసం వేచి చూస్తుండగా..  రిక్షా నడుపుకొనే ఓ యువకుడు తాగేసి వచ్చి ఆమెను వేధించసాగాడు. అంతేకాకుండా.. ఆమె చేయి కూడా పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తొలుత అతని చర్యకు భయపడిపోయిన ఆ యువతి ఆ తర్వాత ఎదిరించింది. 

Last Updated : May 12, 2018, 01:18 PM IST
పోలీసుల సహాయం అందకపోవడంతో... ఈవ్‌టీజర్‌ని చితకబాదిన యువతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఓ 23 ఏళ్ల యువతి ఆటో కోసం వేచి చూస్తుండగా..  రిక్షా నడుపుకొనే ఓ యువకుడు తాగేసి వచ్చి ఆమెను వేధించసాగాడు. అంతేకాకుండా.. ఆమె చేయి కూడా పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తొలుత అతని చర్యకు భయపడిపోయిన ఆ యువతి ఆ తర్వాత ఎదిరించింది. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌తో అతడి తలపై బాది గట్టిగా అరిచింది.

వెంటనే స్థానికులు అక్కడకు వచ్చి ఆమెకు సహాయం చేశారు. ఆ తాగుబోతుని పట్టుకొని పక్కనే ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు తీసుకెళ్లారు. కానీ ఆ కంట్రోల్ రూమ్‌లో ఎవరూ లేకపోవడంతో విస్తుపోవడం వారి వంతైంది. అయితే స్థానికులు ఆమెకు "100" నెంబరుకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయమని అడిగారు. వారు చెప్పిన విధంగానే బాధితురాలు పోలీస్ హెల్ప్ లైనుకి ఫోన్ చేయగా.. ఆపరేటర్ సంగతి అంతా విని పోలీసులు పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారని తెలిపారు. అయితే వారు అరగంట అయినా రాలేదు. 

విసిగిపోయిన బాధితురాలు మళ్లీ పోలీసు హెల్ప్ లైను నెంబరుకి ఫోన్ చేసింది. ఈ సారి ఆపరేటర్ మాట్లాడుతూ, ప్రస్తుతం పోలీసులు ఎవరూ అందుబాటులో లేరని.. వారు రావడం లేదని తెలపడంతో ఆమె షాక్ తింది. అదే విషయాన్ని స్థానికులకు చెబితే, వారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. అయితే ఆమెను వేధించిన తాగుబోతు మాత్రం "పోలీసులు రారని నాకు తెలుసు.

టైమ్ వేస్ట్ చేసుకోకుండా అందరూ ఇక్కడ నుండి వెళ్లండి" అని ఉచిత సలహా ఇచ్చాడు. ఈసారి కోపం పట్టలేకపోయిన ఆ యువతి ఓ కర్ర తీసుకొని అతన్ని పిచ్చ కొట్టుడు కొట్టింది. ఆమెకు స్థానికులు కూడా సహాయం చేశారు. ఆఖరికి అతడికి బాగా దెబ్బలు తగిలి రక్తం కారడంతో కాళ్లావేళ్లా పడి వదిలేయమని అడిగాడు. 

ఆ సంఘటన గురించి బాధితురాలు రాతపూర్వకంగా ఇంటర్నెట్‌లో పోస్టు చేయగా.. ఢిల్లీ పోలీస్ అధికారులు ఆమెతో మాట్లాడారు. సమయానికి పోలీసులు రాకపోవడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తూ.. కంట్రోల్ రూమ్ అధికారులపైనా.. డ్యూటీ ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Trending News