అధికారంలో ఉన్నవారే "తుక్డే తుక్డే ముఠా" బీజేపీపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ ప్రపంచ ర్యాంకింగ్ లో 10 స్థానాలకు పడిపోయిందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.     

Last Updated : Jan 23, 2020, 03:21 PM IST
అధికారంలో ఉన్నవారే "తుక్డే తుక్డే ముఠా" బీజేపీపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ ప్రపంచ ర్యాంకింగ్ లో 10 స్థానాలకు పడిపోయిందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.   

ఎకనామిస్ట్ గ్రూప్ పరిశోధన, విశ్లేషణ విభాగం అయిన  ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారుచేసిన డెమోక్రసీ ఇండెక్స్ - 160-ప్లస్ దేశాలలో ప్రజాస్వామ్య స్థితి పై  స్నాప్‌షాట్‌ను అందించారు.

భారతదేశం మొత్తం స్కోరు, 0-10 స్కేల్‌లో, 2018లో 7.23 నుండి 2019లో 6.90కి పడిపోయిందని, సర్వే "రిగ్రెషన్స్" దేశాల్లో ఒకటైన భారత్ స్థానాన్ని విడుదల చేయగా భారత్ 51 వ స్థానంలో ఉందని తెలిపింది.

చిదంబరం ఈ నివేదికపై స్పందిస్తూ, గత రెండేళ్ల భారత్ లో  జరిగిన సంఘటనలను నిశితంగా గమనించినట్లైతే  “ప్రజాస్వామ్యం క్షీణించిందని, ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడ్డాయని తెలుస్తుందని అని నొక్కి చెప్పారు.

అధికారంలో ఉన్నవారే నిజమైన 'తుక్డే తుక్డే' ముఠా" అని చిదంబరం బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రజాస్వామ్య సూచిక జమ్మూ కాశ్మీర్‌లో సంభవించిన  మార్పులను, అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)లను వివాదాస్పదంగా అమలు చేయడాన్ని ప్రస్తావించిన ఇండెక్స్, ఈ చర్యలు భారతదేశంలో ప్రజాస్వామ్య తిరోగమనాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ లో ఇటువంటి పరిస్థితులు దురదృష్టకరమని చిదంబరం పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News