Norovirus Symptoms and Prevention: కరోనా వైరస్ మహమ్మారి శకం (Epidemic of Coronavirus) ముగియకముందే.. మరో వైరస్ ప్రపంచంపై విరుచుకు పడటానికి సిద్ధం అవుతుంది. కేరళలో పెరుగుతున్న నోరోవైరస్ కేసులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. కేరళలోని వాయనాడ్‌లో రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకినా ఈ వైరస్ పట్ల ప్రభుత్వం ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.
నోరో వైరస్ అంటే ఏమిటి?
నోరోవైరస్ జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా కడుపులోని అవయవాలు, వాపుకు గురై తీవ్రమైన వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి. నిజానికి నోరో వైరస్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ చిన్న పిల్లలు, వృద్దులపై ప్రమాదకరమైన అనారోగ్యకర పరిస్థులను కలిగిస్తుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్యాలను కలిగి ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
నోరో వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
నోరో వైరస్ సోకిన వ్యక్తిని సంప్రదించడం ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తి తిరిగిన ప్రదేశాన్ని తాకడం ద్వారా నోరోవైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అధిక విరేచనాలు లేదా వాంతులు కారణంగా శరీరంలో నీరు లేకపోవడం (డీ హైడ్రేషన్) సమస్యను పెంచుతుందని గుర్తుంచుకోండి.
నోరోవైరస్‌ను ఎలా నివారించాలి?
నోరోవైరస్ సోకిన వారు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. తరచుగా ORS మరియు వేడి నీరు త్రాగుతూ ఉండాలి. ఆహారం తినే ముందు మరియు మలవిసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. జంతువులకు దగ్గరగా ఉండే వ్యక్తులు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్
రెండు వారాల క్రితం, వాయనాడ్ (Wayanad) జిల్లాలోని విత్తిరి సమీపంలోని పుకోడ్‌లోని (Pukode) వెటర్నరీ కళాశాలలో (Veterinary College) జంతువుల ద్వారా సంక్రమించే నోరో అనే వైరస్ 13 మంది విద్యార్థులకు కలుషిత నీరు మరియు ఆహారం ద్వారా ఈ వ్యాధికి గురయ్యారని నివేదికలో వెల్లడించబడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook