Bhavanipur Bypoll: భవానీపూర్ ఉపఎన్నికల ఫలితాలు నేడే, తేలనున్న దీదీ భవితవ్యం

Bhavanipur Bypoll: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు ఇవాళ అగ్నిపరీక్ష. లేకపోతే ముఖ్యమంత్రి పదవే ప్రశ్నార్ధకంగా మారుతుంది. కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడనున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 07:15 AM IST
  • భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు కాస్సేపట్లో ప్రారంభం
  • మమతా బెనర్జీ భవితవ్యం తేలేది నేడే
  • భవానీపూర్ ఉపఎన్నికలో 57 శాతం నమోదైన పోలింగ్
Bhavanipur Bypoll: భవానీపూర్ ఉపఎన్నికల ఫలితాలు నేడే, తేలనున్న దీదీ భవితవ్యం

Bhavanipur Bypoll: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు ఇవాళ అగ్నిపరీక్ష. లేకపోతే ముఖ్యమంత్రి పదవే ప్రశ్నార్ధకంగా మారుతుంది. కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడనున్నాయి.

దేశవ్యాప్తంగా ఆసక్తి కల్గించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల(West Bengal Assembly Elections) ఫలితాలు చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ మెజార్టీతో టీఎంసీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నా..ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్(Nandigram) అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆరు నెలల్లోగా అసెంబ్లీ లేదా మండలి నుంచి ఎన్నిక కావల్సి ఉంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో మండలి లేకపోవడంతో విధిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాల్సిన పరిస్థితి వచ్చింది దీదీకు. ఈ నేపధ్యంలో మమతా బెనర్జీ(Mamata Banerjee) కోసం భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టీఎంసీకు(TMC) కంచుకోటగా ఉంది. వాస్తవానికి ఈ నియోజకవర్గం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. అయితే రాజకీయ సవాళ్లు , ప్రతి సవాళ్ల కారణంగా మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం వదిలి నందిగ్రామ్ నుంచి పోటీ చేసి..బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. దాంతో తిరిగి ఇప్పుడు భవనీపూర్(Bhavanipur Bypoll) నుంచి పోటీ చేశారు. గురువారం భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. కేవలం 57 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తక్కువ శాతం పోలింగ్ కావడంతో కౌంటింగ్ ప్రారంభమైన గంటన్నరకే ఫలితాల్లో స్పష్టత రానుంది. 

Also read: Lal Bahadur Shastri Car: పెన్షన్ డబ్బులతోనే కారు ఈఎంఐ చెల్లించిన ఏకైక ప్రధాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News