Rachna Banerjee as TMC MP Candidate: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించాయి. తాజాగా పశ్చిమ బంగలోని అధికార టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలోని 42 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో నటించిన రచన బెనర్జీ ఉండటం విశేషం.
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో ఇండియా కూటమిలో కలకలం రేపింది. జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Mahua Moitra Case: రాహుల్ గాంధీ తరువాత మరో ఎంపీపై వేటు పడనుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mamata Banerjee: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కక్ష సాధింపులా ఉండకూడదని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Presidential Election: భారత రాష్ట్రపతి ఎన్నికల వేళ కీలక పరిణామం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు తృణామూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
Mamata letter to oppositions: దేశ రాజకీయాలు చక చక మారుతున్నాయి. తెలంగాణ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Mamata Comments: కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. గతకొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా బీజేపీ పార్టీ పెద్దలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.
Yashwant Sinha Comments: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారంగా ఇండియాలో అన్ని మతాల్ని నిషేధించమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mamata New Front: దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వస్తున్నాయి. కొత్త కూటముల కోసం ఓ వైపు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా..మరోవైపు మమతా బెనర్జీ కూడా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ను కలుపుకుంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
Mamata Banerjee: భవానీపుర్ ఉపఎన్నికలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Bhavanipur Bypoll: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు ఇవాళ అగ్నిపరీక్ష. లేకపోతే ముఖ్యమంత్రి పదవే ప్రశ్నార్ధకంగా మారుతుంది. కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడనున్నాయి.
West Bengal assembly bypolls: ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు కట్టదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల సమీపంలో సెక్షన్ 144 విధించారు. భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉన్న విషయం తెలిసిందే.
Nusrat Jahan: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ చేదు అనుభవం ఎదురైంది. బుధవారం కోల్‌కతాలో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది.
West Bengal: దేశంలో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించింది నెరవేరలేదు. వరుసగా మూడోసారి టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో అక్కడి బీజేపీ ఎంపీలు రాజీరామాలు సమర్పించారు.
West Bengal Cabinet:పశ్చిమ బెంగాల్లో జంబో కేబినెట్ కొలువు దీరబోతోంది. వరుసగా మూడవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దీదీ..భారీ కేబినెట్ ఏర్పాటు చేశారు. కాస్సేపట్లో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
Mamata Banerjee Oath: బెంగాల్ పీఠాన్ని ముచ్చటగా మూడవసారి కైవసం చేసుకున్న దీదీ..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో అత్యంత సాధారణంగా కొద్దిమందితోనే కార్యక్రమం ముగిసింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో దీదీ వరుసగా మూడవ సారి అధికారం చేజిక్కించుకున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన బెంగాల్ ఫలితం టీఎంసీకు వన్‌సైడ్ అయింది. మరిప్పుడు దీదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
West Bengal: బెంగాల్ ఎన్నికలతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు దశాబ్దాలపాటు అప్రతిహంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ నేడు ఉనికి లేకుండా పోయింది. వామపక్షాల పోరాట పంథాను వణికి పుచ్చుకున్న దీదీ..బెంగాలీల మనసు గెల్చుకుంది.
West Bengal election result live updates: న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జి మరోసారి విజయం సాధించారు. ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల సరళి గణాంకాల ప్రకారం దీదీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి 202 స్థానాల్లో ఆధిక్యత చాటుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 అసంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. ఇప్పటివరకు 286 స్థానాల్లో అభ్యర్థుల విజయంపై స్పష్టత ఏర్పడింది.
Mamata Banerjee Victory: పశ్చిమ బెంగాల్ నిజంగా ఉత్కంఠ రేపింది. దేశమంతా ఎదురుచూసిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు నిజంగానే ఆశ్చర్యం కల్గించాయి. మమతా హ్యాట్రిక్ విజయం ఓ వైపు, హోరాహోరీ పోరులో పోరాడి గెలవడం మరోవైపు ఆసక్తి కల్గించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.