గుజరాత్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖుల రాక

గాంధీనగర్‌లోని సచివాల గ్రౌండ్స్ రూపానీ ప్రమాణస్వీకారోత్సవానికి వేదిక కానుంది. 

Last Updated : Dec 26, 2017, 12:41 PM IST
గుజరాత్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖుల రాక
బీజేపీ నేత విజయ్ రూపానీ నేడు గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్ రూపానీ గుజరాత్‌కి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండటం ఇది రెండోసారి. పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌లని ఎంపిక చేసింది. గాంధీనగర్‌లోని సచివాల గ్రౌండ్స్ రూపానీ ప్రమాణస్వీకారోత్సవానికి వేదిక కానుంది. 
 
ఉదయం 11 గంటలకి జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 9 గంటల ప్రాంతంలో గుజరాత్ చేరుకోనున్నారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ లాంటి అగ్ర నేతలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. 
 
ఇదే వేదికపై రూపానీ, నితిన్ పటేల్‌లతోపాటు ఆరుగురు నుంచి తొమ్మిది మంది వరకు కేబినెట్ మంత్రులు, మరో 15 మంది సహాయ మంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ మంత్రి హోదా దక్కేవారి జాబితాలో భూపేంద్ర సింగ్ చుదాసమ, కౌశిక్ పటేల్, గణ్‌పత్ వాసవ, దిలీప్ థాకూర్, బాబుబాయి బొకిరియా, ప్రదీప్ సింగ్ జడేజా లాంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. 

Trending News