Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన కొత్త మార్పులు ఇవే..!

Vande Bharat Express New Features: ఇక నుంచి కొత్త రంగులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు పెట్టనుంది. కొత్త రైలుతో రంగుతోపాటు మరిన్ని మార్పులు చేశారు. దీంతో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించనున్నారు. ఆ మార్పులు ఏంటంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 20, 2023, 11:28 PM IST
Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన కొత్త మార్పులు ఇవే..!

Vande Bharat Express New Features: దేశంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి అత్యాధునిక వసతులతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో వందే భారత్ రైలు పరుగులు పెడుతుండగా.. వివిధ మార్గాల్లో కొత్తగా ఆరెంజ్ అండ్ గ్రే కలర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి అయింది. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేసిన కొత్త రైలు‌ను చెన్నైలో మొదటి ట్రయల్ రన్‌కు ముందు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించిన విషయం తెలిసిందే.

కొత్త కలర్‌లో ఉన్న వందే భారత్ రైలు ట్రయల్ రన్ ఐసీఈ, పాడి రైల్వే ఫ్లైఓవర్ మధ్య జరిగింది. కొత్త రైలులో రంగుతోపాటు అనే ఫీచర్లలో మార్పులు చేశారు. దీంతో ప్రయాణికులు గతంలో కంటే మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. అవేంటంటే..? 

==> వందేభారత్‌లో సీటు గతంలో కంటే సౌకర్యవంతంగా.. మెత్తగా ఉంటుంది.
==> సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను కూడా పెంచారు. 
==> వాష్ బేసిన్ లోతు ఎక్కువగా ఉంటుంది. 
==> ఛార్జింగ్ పాయింట్ గతంలో కంటే మెరుగ్గా పనిచేస్తుంది
==> ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లోని సీట్ల రంగు ఎరుపు నుంచి గోల్డ్, నీలం రంగులో ఉంటాయి. 
==> మరుగుదొడ్లలో కాంతిని 1.5 నుంచి 2.5 వాట్లకు పెంచారు.
==> కర్టెన్లు గతంలో కంటే బలంగా ఉంటాయి. 
==> కుళాయిలో నీటి ప్రవాహం కూడా మెరుగ్గా ఉంటుంది.
==> టాయిలెట్ హ్యాండిల్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.
==> ఏసీ బాగా వచ్చేందుకు గాలి రాకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకున్నారు.

మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రధాని మోదీ ప్రారంభించగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రూట్లలో నడుస్తోంది. మేక్ ఇన్ ఇండియా కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తయారు చేస్తున్నారు. త్వరలోనే స్లీపర్ కోచ్‌లతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాత్రిపూట ప్రయాణికులు పడుకుని వెళ్లే సౌకర్యం తీసుకువచ్చేందుకు మార్పులు చేయనుంది. 

Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు  

Also Read: Etela Rajender: లంబాడా తల్లుల శీలాన్ని శంకిస్తున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News