Ram Mandir Pran Pratishtha Ceremony: అయోధ్య రామజన్మభూమి వేడుకల నేపథ్యంలో దేశమంతట పండుగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు అయోధ్య రామ్ లల్లా దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో ప్రస్తుతం అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక అయోధ్య విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగింది. అయోధ్య రామ్‌లల్లా ట్రస్ట్ పలువురు రాజకీయ ప్రముఖులకు, గవర్నర్లకు, ఇతర రాష్ట్రాల సీఎంలను, సెలబ్రీటీలను,అనేక రంగాలకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వనించింది. వీఐపీలను మాత్రమే కాకుండా, కొందరు సామాన్యులకు కూడా అయోధ్య భవ్యరామమందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశంను కూడా రామజన్మభూమి ట్రస్ట్ కల్పించింది. దీంతో అయోధ్య అంతాట కూడా కేంద్ర బలగాలు, పారామిలటరీ బలగాలు, డ్రోన్లతో ప్రత్యేకంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ అయోధ్యకు తరలివస్తున్న వివిధ రాష్ట్రాల సీఎంలు, సాధువులు, మత పెద్దలు, భక్తజనులందరికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. తన ఎక్స్ అకౌంట్ వేదికగా.. జైసియారామ్ అంటూ పోస్ట్ చేశారు. "ఎన్నో ఏళ్లుగా మనం కోరుకుంటున్న అయోధ్య రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం సాకారం అయిన నేపథ్యంలో ప్రజలందరికి కూడా ప్రత్యేకంగా భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయోధ్యకు చేరుకుని పూజకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో మోదీ ప్రత్యేకంగా ఉపవాసం ఉండి, నియమనిష్టలతో పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చారు.కాగా, ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల ఏళ్లపాటు కొనసాగిన నిరీక్షణ ఈరోజు నెరవేరబోతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామ్ లల్లా ప్రతిష్టాపన నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ రోజు తన గురువులు మహంత్ దిగ్విజయ్‌నాథ్ మహారాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లను స్మరించుకుని ఉద్వేగ భరితంగా నివాళులు అర్పించారు. అంతకుముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంతో రామరాజ్యం ప్రారంభమవుతుందని, అసమానతలన్నీ తొలగిపోతాయన్నారు.
‘‘ఈరోజు నుంచి ప్రాణ ప్రతిష్ఠతో రామరాజ్యం ప్రారంభం కానుంది. అసమానతలు అన్నీ తొలగిపోతాయి.. అయోధ్య నుంచి యావత్ దేశానికి వచ్చే మార్పు ఎంతో అందంగా ఉంటుంది. అందరూ సామరస్యంగా జీవిస్తారు. సద్భావనతో జీవిస్తాం.. శ్రీరాముడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఆర్మీ హెలికాప్టర్లు అయోధ్యపై పూల వర్షం కురిపిస్తాయని, ప్రాణ ప్రతిష్ఠా రోజున రామజన్మభూమి ఆలయంలో ఆరతి సమయంలో ఆలయ ప్రాంగణంలో 30 మంది కళాకారులు వివిధ భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. చారిత్రాత్మకమైన ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, మతపరమైన విభాగాల ప్రతినిధులు హాజరవుతారు. వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఈ విశిష్ట సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. గర్భ-గుడిలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత, మిగతా భక్తులందరికి కూడా రామ్ లల్లాను దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
Also Read: PINEWZ App: ఎస్సెల్ గ్రూప్ నుంచి సరికొత్త న్యూస్ యాప్, అయోధ్యలో PINEWZ లాంచ్
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook