Uttar Pradesh Businessman Suicide Attempt: తాను బిజినెస్‌లో నష్టపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణమంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో లైవ్‌లో తన సమస్యలు చెప్పుకుంటూనే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తాను ఆర్థికంగా ఇబ్బందులుపడడానికి ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించాడు. యూపీలోని బాగ్‌పత్‌కు చెందిన షూ వ్యాపారి నలభై ఏళ్ల రాజీవ్ తోమర్ ఫేస్‌బుక్ లైవ్‌లో తన సమస్యలు చెప్పుకున్నాడు.
ఈ క్రమంలో లైవ్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నోట్ల రద్దు అలాగే జీఎస్టీ వల్ల తాము అప్పుల పాలయైనట్లు రాజీవ్ తోమర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన మరణానికి ప్రధాని మోదీనే కారణం అవుతారంటూ రాజీవ్ పేర్కొన్నారు. మోదీకి చేతనైతే పరిస్థితుల్ని చక్కదిద్దాలన్నారు.
మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలను తాను తప్పుబట్టడం లేదన్నారు. కానీ రైతులకు చిన్నపాటి వ్యాపారులకు మోదీ ఏమాత్రం హితుడు కాదంటూ రాజీవ్ ఆరోపించాడు. కాగా రాజీవ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుండగా ఆయన భార్య పూనం అడ్డుకునే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో రాజీవ్ భావోద్వేగంగా మాట్లాడాడు.. ప్రభుత్వం మనల్ని ఎలాగో పట్టించుకోదు... కనీసం నువ్వు అయినా విను అంటూ ఆమెతో అన్నాడు. అయితే అప్పటికే రాజీవ్ తోమర్ విషం తీసుకున్నాడు. దీంతో ఆయన భార్య కూడా విషం తాగింది. ఇక వారిని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే రాజీవ్ తోమర్ భార్య మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉంది.
కాగా 2020లో విధించిన లాక్‌డౌన్ వల్ల రాజీవ్ తోమర్ షూ వ్యాపారం పూర్తి దెబ్బతిన్నట్లు ఆయన బంధువులు పేర్కొన్నారు. రాజీవ్ షాప్‌లోని బూట్లలో అన్నీ పాడైపోయాయన్నారు. దీంతో ఆయన అప్పులు చెల్లించలేక ఇబ్బందులుపడ్డారన్నారు. ఇక రాజీవ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ విచారం వ్యక్తం చేశారు.
Also Read: Privilege Motion Notice: ప్రధాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నిరసన, నరేంద్ర మోదీపై సభా హక్కు
Also Read: Tollywood: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook