/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

CM KCR DELHI TOUR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన కేంద్రంగా కీలక చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఎస్పీ  సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్‌ తో కలిసిన కేసీఆర్ ను కలిసిన అఖిలేష్.. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. ఇద్దరి మధ్య జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. తన నివాసానికి వచ్చిన అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ ను  కేసీఆర్  సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం దేశ రాజకీయాలపై చర్చించారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజులు ప్రశ్నించడం, పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై దాడులు వంటి అంశాలపైనా కేసీఆర్, అఖిలేష్ యాదవ్ మాట్లాడుకున్నారని చెబుతున్నారు. మోడీ సర్కార్ విపక్ష నేతలను టార్గెట్ చేస్తుందని ,  ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను ప్రయోగిస్తోందని కేసీఆర్, అఖిలేష్ యాదవ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. 

నిజానికి ఢిల్లీ పర్యటనలో తొలిరోజే నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం కేసీఆర్ కలుస్తారనే ప్రచారం సాగింది. కాని కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మూడు రోజులైనా ఆయన రాష్ట్రపతి భవన్ వెళ్లలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇక మూడు రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. దీంతో ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణలో పీకే టీమ్ చేసిన సర్వేపై ఆయన కసరత్తు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.   

Read also: KTR: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి

Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
UP EX CM Akhilesh Yadav Meet Telangana CM Kcr In Delhi Discussion On National Politics
News Source: 
Home Title: 

CM KCR DELHI TOUR:జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దూకుడు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ తో చర్చలు 
 

CM KCR DELHI TOUR:జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దూకుడు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ తో చర్చలు
Caption: 
FILE PHOTO kcr delhi tour
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ 

కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

ఇద్దరి మధ్య 2 గంటల చర్చలు  

Mobile Title: 
CM KCR DELHI TOUR:జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దూకుడు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ తో చర్చలు
Srisailam
Publish Later: 
No
Publish At: 
Friday, July 29, 2022 - 19:40
Created By: 
Somanaboina Yadav
Updated By: 
Somanaboina Yadav
Published By: 
Somanaboina Yadav
Request Count: 
38
Is Breaking News: 
No