Flood Affected States: వరద, కొండ చరియలు విరిగిపడడం.. భారీ వర్షాలు వంటి ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసింది. కొన్ని వారాల కిందట భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన తెలుగు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది. జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సహాయ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల కిందట తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదలవగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,036 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వరద ప్రభావిత రాష్ట్రాలకు రూ.5858.60 కోట్లను కేంద్ర హోంశాఖ జామ చేసింది.
Also Read: Temple Thieves: ఈ దొంగలకు దేవాలయాలు కనిపిస్తే చాలు.. దేవుడికే నిలువు దోపిడీ
రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్)కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు కొండచరియలు విరిగిపడడంతో 14 రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్న ప్రాంతాలను కేంద్ర బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించి కేంద్ర బృందాలు హోం శాఖకు ప్రాథమిక నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా అడ్వాన్స్‌గా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది.
Also Read: Rave Party: కర్ణాటకలో మళ్లీ రేవ్ పార్టీ కలకలం.. 15 మంది యువతులతో సహా 50 మంది అరెస్ట్
రాష్ట్రాలకు దక్కిన నిధులు
- మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు
- ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు
- అస్సాంకు రూ.716 కోట్లు
- బీహార్‌కు రూ.655.60 కోట్లు
- గుజరాత్‌కు రూ.600 కోట్లు
- హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు
- కేరళకు రూ.145.60 కోట్లు
- మణిపూర్‌కు రూ.50 కోట్లు
- మిజోరాంకు రూ.21.60 కోట్లు
- నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు
- సిక్కింకు రూ.23.60 కోట్లు
- తెలంగాణకు రూ.416.80 కోట్లు
- త్రిపురకు రూ.25 కోట్లు
- పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.