New Toll Sytem: ఇక నెంబర్ ప్లేట్లు కాదు..టోల్ ప్లేట్లు, ఫాస్టాగ్ స్థానంలో కొత్త విధానం

New Toll Sytem: టోల్ వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానం తీసుకొస్తోంది. ఇకపై ఫాస్టాగ్ అవసరం ఉండదు. త్వరలో టోల్ విధానంలో కొత్త మార్పులు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 19, 2023, 10:44 AM IST
New Toll Sytem: ఇక నెంబర్ ప్లేట్లు కాదు..టోల్ ప్లేట్లు, ఫాస్టాగ్ స్థానంలో కొత్త విధానం

New Toll Sytem: టోల్ ప్లాజాల వద్ద మొన్నటి వరకూ ఆగి..డబ్బులు చెల్లించి రసీదు తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉండేది. ఆ తరువాత ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఫాస్టాగ్ విధానం ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో కొత్త విధానం ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. 

మొన్నటి వరకూ టోల్ ప్లాజాల వద్ద ఆగి డబ్బులు చెల్లించి రసీదు తీసుకునే పరిస్థితి ఉండేది. దీనివల్ల టైమ్ చాలా వృధా అవడమే కాకుండా ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ తరువాత ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్ విదానం ప్రవేశపెట్టింది. ఈ విదానంతో చాలావరకూ సమస్య పరిష్కారమైంది. టోల్ గేట్ వద్ద ఆలస్యం చాలావరకూ నియంత్రించబడింది. టోల్ ప్లాజా ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు సమయానికి చేరుకోకపోవడంతో ఏడాదికి 1 లక్షల 45 వేల కోట్లు దేశం నష్టపోతోందని ఓ అంచనా. అందుకే ఇప్పుడు మరొ కొత్త విధానం అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అదే జీపీఎస్ టెక్నాలజీ. అంటే ఇకపై ఫాస్టాగ్ ఉండదు. 

ఈ కొత్త విధానంలో వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనం యజమాని బ్యాంకు ఎక్కౌంట్ నుంచి టోల్ కట్ అవుతుంది. టోల్ ప్లాజా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఉండే కెమేరాలు ఆ నెంబర్ ప్లేట్ల ఫోటోలు క్యాప్చర్ చేస్తాయి. ఫాస్టాగ్ విధానానికి మరింత మెరుగైన విధానమని భావిస్తున్నారు. ఎందుకంటే ఫాస్టాగ్ విధానం వచ్చాక కూడా ట్రాఫిక్ జామ్ పరిస్థితి పూర్తిగా తగ్గలేదు. ఇంకా ఎంతో కొంత సమయాలాపన జరుగుతోంది. ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఐఎమ్ కోల్‌కతా నివేదిక ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచి ఉండే కారణంగా ఏడాదికి లక్ష కోట్ల విలువైన ఇంధనం వృధా అవుతోంది. ఏడాదికి ఆలస్యం కారణంగా 1 లక్షా 45 వేల కోట్లు దేశానికి నష్టం వాటిల్లుతోందని అంచనా. జీపీఎస్ విదానం అనేది మీ ఖర్చుల్ని తగ్గించడమే కాకుండా దేశ ఆర్ధిక వ్యవస్థకు దోహదం చేయనుంది.

ఈ కొత్త విధానంలో వాహనం నెంబర్ ప్లేట్ స్కాన్ అయి వాహనం యజమాని బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. గత ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదన వివరించారు. ఈ కొత్త విధానంతో ఆ నేషనల్ హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత వరకూ టోల్ కట్ అవుతుంది. 

అంటే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనం నెంబర్ ప్లేట్ సాధారణమైంది ఉండదు. జీపీఎస్ టెక్నాలజీ ఉండే ప్లేట్ ఉంటుంది. ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ జీపీఎస్ నెంబర్ ప్లేట్లను అమర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పాత వాహనాలు కొత్త నెంబర్ ప్లేట్లను అమర్చుకోవల్సి ఉంటుంది. జీపీఎస్ వ్యవస్థ నెంబర్ ప్లేట్‌కు అనుసంధానమై ఉంటుంది. దాంతోపాటు ఇన్‌స్టాల్ అయుండే సాఫ్ట్‌వేర్ ఆధారంగా  టోల్ ప్లాజాకు చేరుకోగానే ఆటోమేటిక్‌గా టోల్ కట్ అవుతుంటుంది. 

టోల్ ఎంతనేది ఆ టోల్ ప్లాజాకు రాగానే జీపీఎస్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. జాతీయ రహదారిపై ప్రస్తుతం ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా ఉంది. అంటే ప్రతి 60 కిలోమీటర్లకు మీరు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జాతీయ రహదారిపై తక్కువ దూరమే ప్రయాణించినా టోల్ మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందే. అదే జీపీఎస్ విదానం అమల్లోకి వస్తే ఒకవేళ మీరు జాతీయ రహదారిపై 30 కిలోమీటర్లు ప్రయాణించినట్టు జీపీఎస్ నిర్దారిస్తే ఆ 30 కిలోమీటర్లకే సగం టోల్ వసూలవుతుంది. 

Also read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News