Aatma Nirbhar Health Yojana: Union Budget 2021లో సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సామాన్యుడి ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పలు పథకాలను ప్రకటించారు.
ఇదివరకే కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్ల రూపాయాలు కేటాయించినట్లు తెలిపిన ఆమె, అనంతరం సామాన్యుల ఆరోగ్యం కోసం ఆత్మనిర్భర్ భారత్ ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం పేరు ఆత్మ నిర్భర్ హెల్త్ యోజన కాగా, ఇందుకోసం తాజా బడ్జెట్ 2021లో ఏకంగా రూ.64,180 కోట్లు కేటాయించారు. వచ్చే ఆరేళ్లలో సామాన్యుల ఆరోగ్యం కేసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని తమ ప్రభుత్వం వెచ్చించనుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read: Budget 2021: కరోనా వ్యాక్సిన్ కోసం Budget 2021లో భారీ కేటాయింపులు, వైరల్ ల్యాబ్‌లు
ఆరోగ్యం రంగం కోసం ఈ ప్రత్యేక నిధితో పాటు కొత్తగా 9 బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొత్త స్కీమ్ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బలోపేతమౌతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగంలో మార్పులు తీసుకు వచ్చేందుకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు
అంతకుముందు కేంద్ర కేబినెట్ ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. నేటి (ఫిబ్రవరి 1, 2021న) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ 2021ను ప్రవేశపెట్టారు. వాహన రంగాలు, అన్నదాతలు ఇలా పలు రంగాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడిస్తున్నారు.
Also Read: Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitaram
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook