హ్యాకర్స్ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపై ఫోకస్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌కు సంబంధించిన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ (PM Modis Website Twitter account hacked)కు గురైంది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ట్విట్టర్ తెలిపింది.
2011లో క్రియేట్ చేసిన ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విట్టర్ ఖాతాను 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకూ 37,000 వరకు ట్వీట్లు చేశారు. అయితే జాన్ విక్ (hckindia@tutanota.com) ఈ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు ట్వీట్ చేశారు.
Twitter account of PM Modi's personal website hacked
Read @ANI Story | https://t.co/NYZhitc50c pic.twitter.com/V7Wpa6H4c4
— ANI Digital (@ani_digital) September 3, 2020
కాగా, క్రిప్టో కరెన్సీ రూపంలో ప్రధాన మంతి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ట్వీట్లు చేశారు. దీంతో అనుమానమొచ్చి చెక్ చేస్తే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించారు. అయితే ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్‌కు ఏ ఇబ్బంది లేదని, ఆ ట్విట్టర్ అప్‌డేట్స్ నమ్మవచ్చునని తెలిపారు.
PM Modi: ప్రధాని మోదీ లక్ష్యంగా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్