I'm MLA Stand up: 'నేను ఎమ్మెల్యేను. ముందు లేచి నిలబడు' అని ఎమ్మెల్యే నిలదీయగా.. 'ఆయన చెబితే నిలబడాల్నా.. కూర్చో' అని ఓ మహిళా ప్రజాప్రతినిధి బదులిచ్చింది. ఎమ్మెల్యే దాదాగిరిపై తిరగబడింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మనస్తాపం చెందిన ఆ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
మెట్టుపాలయం ఏఐడీఎంకే ఎమ్మెల్యే ఏకే సెల్వరాజ్ ఇటీవల కోయంబత్తూరులోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో మాట్లాడారు. ఈ సమయంలో ఒక విషయమై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి మున్సిపల్ కమిషనర్ ఆముదను, ఉద్యోగులను ఎమ్మెల్యే సెల్వరాజ్ నిలదీశారు. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ముందు లేచి నిలబడండి. నేను ఎమ్మెల్యేను' అని గద్దించారు. 'ఈ గదిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎందుకు ఉన్నారు. వాళ్లకు ఏం పని కనీసం తెలివి లేదా. మెట్టుపాళయం మొత్తం నాకు ఓటు వేసింది' అని ఎమ్మెల్యే అధికారిణిపై పరుష వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడడంతో మెట్టుపాళయం మున్సిపల్ కమిషనర్ అముదా లేచి నిలబడ్డారు. ఈ పరిణామం చూస్తున్న మున్సిపల్ చైర్మన్ మెహరీబా కల్పించుకుని ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇది మీ కార్యాలయం. మీరెందుకు నిలబడాలి. కూర్చోండి' అని కమిషనర్ అముదాను కుర్చీలో కూర్చోబెట్టారు. 'ఎమ్మెల్యే అడిగితే లేచి నిలబడాల్సిన అవసరం లేదు. మీరు కమిషనర్. కూర్చోండి' అని చైర్‌పర్సన్ సూచించింది. దీంతో అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ చైర్‌పర్సన్‌గా వివాదం జరిగింది. పరస్పరం ఇరువర్గాలు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోవడంతో కార్యాలయం గందరగోళం ఏర్పడింది.
పోలీసులకు ఫిర్యాదు
కాగా, అధికారిణితో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే మాటలకు కమిషనర్ మనస్తాపానికి లోనయ్యారు. చైర్‌పర్సన్ హమీబా పట్టుబట్టడంతో ఎమ్మెల్యేపై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న అధికారిణిపై అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Also Read: JanaSena Party: జనసేనకు డబుల్ బొనాంజా.. జానీ మాస్టర్, పృథ్వీ చేరిక.. గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు
Also Read: Sharmila fire on Jagan: బీజేపీతో అన్నయ్య కుమ్మక్కు.. సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook