West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. బీజేపీ-టీఎంసీ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీజేపీకు ఓటేస్తే ..బెంగాలీల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ముగిసింది. 8 విడతల్లో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్(West Bengal)లో హోరోహోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీజేపీకు ఓటేస్తే బెంగాలీల్నే రాష్ట్రం నుంచి తరిమిస్తారంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించడం సంచలనంగా మారింది.
నందిగ్రామ్(Nandigram)లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. బీజేపీ(BJP)కు ఓటేస్తే బయటి గూండాలతో తరిమేస్తారని..రాష్ట్రంలోని ప్రతిదాన్నీ లాక్కుంటారని మమతా బెనర్జీ ఆరోపించారు. చివరకు రాష్ట్ర మనుగడే ప్రశ్నార్ధకమవుతుందన్నారు. అదే టీఎంసీకు ఓటేస్తే మాత్రం ఇంటి వద్దకే రేషన్ అందుతుందని చెప్పారు. బెంగాలీల ప్రయోజనాల్ని రక్షిస్తామన్నారు. నందిగ్రామ్‌లో గెలిస్తే..తన కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకుంటానన్నారు. ఈ ఆటలో గెలిచి బీజేపీ గూండాగిరిని చీపుర్లతో తరిమేయాలని పిలుపునిచ్చారు. రైతన్నలు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన (Farmers protest)చేస్తుంటే మోదీ, బీజేపీ నేతలు ఆ రైతుల భూముల్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
తన పేరైనా మర్చిపోతాను గానీ నందిగ్రామ్ పేరు మాత్రం మరవనన్నారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ వంటివి జరగకుండా చూడాలన్నారు. వీల్‌ఛైర్‌పై 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నియోజకవర్గానికి చేరుకున్నారు మమతా బెనర్జీ(Mamata Banerjee). మైనార్టీలను బుజ్జగించేందుకు కొత్తగా ఈద్ ముబారక్‌లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
Also read: Karnataka: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా సకెండ్ వేవ్, అప్రమత్తమైన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook