Digital Currency: ఇప్పుడు అంతా డిజిటల్ మయం...అన్ని పనులు డిజిటల్ రూపంలో జరిగిపోతున్నాయి. చేతిలో క్యాష్ పెట్టుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ప్రజలతా డిజిటల్ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజు రోజుకు డిజిటల్ ట్రాన్ జాక్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతీ రోజు 20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. డిజిటల్ ట్రాజాక్షన్స్ ప్రజలకు సౌకర్యాలను కలిగించడంతో పాటు నిజాయితీతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పడంలో సహకరిస్తాయని ఆయన అన్నారు. చిన్న చిన్న ఆన్ లైన్ చెల్లింపుల మొత్తమే దేశంలో రోజుకు ఇరవై వేల కోట్ల వరకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా చిన్న ఆన్‌లైన్ చెల్లింపులే పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహకరిస్తున్నాయని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి ఉండడంతో చాలా సంస్థలు ఈ రంగంలోకి వస్తున్నాయని చెప్పారు. దేశప్రజలనుద్దేశించి నిర్వహించే ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఈ వివరాలను వెల్లడించారు.
డిజిటల్ చెల్లింపులకు ఎంత ఆదరణ లభిస్తోందంటే.... కేవలం ఒక్క మార్చి నెలలోనే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయి’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. నేటి యువత డిజిటల్ చెల్లింపుల్లో ఉండే సౌకర్యాన్ని ఇతరులతో పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త వారిని ఈ పద్ధతి అలవాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇలా పంచుకునే స్వీయ అనుభవాలే మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచి దేశాన్ని నిర్మిస్తాయని తెలిపారు.
పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డిజిటల్ సేవలు ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజులన్నీ డిజిటల్ కరెన్సీదే అని అన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఆర్థిక సేవలకు అందరికీ చేరువ చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన ప్రధానమంత్రి సంగ్రహాలయకు అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి తనకు ఎంతో మంది లేఖలు, మెసేజ్‌లు పంపిస్తున్నారని చెప్పారు. దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానులను స్మరించుకోవడం కోసం ప్రధాన మంత్రి సంగ్రహాలయను నిర్మించినట్లు వెల్లడించారు. దేశాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లు ధరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రధాని మోడి.
Also Read: Michael Vaughan: ముంబై ప్లేఆఫ్‌కు చేరకపోతే...రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడం మంచిది
Also Read: PK-KCR: కేసీఆర్‌తో పీకే వరుస సమావేశాలు, మరి కాంగ్రెస్‌లో చేరిక సంగతేంటి, అసలేం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Digital Currency: భవిష్యత్తు అంతా డిజిటల్ కరెన్సీదే..!!
మున్ముందు మొత్తం డిజిటల్ కరెన్సీనే: మోదీ
రూ.10లక్షల కోట్లకు చేరనున్న యూపీఐ లావాదేవీలు
గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలు