Rain Alert to Telugu States: మార్చి నెల నుండే ఎండలు.. ఉక్కపోత తో ఉక్కిరి బిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశమనం అన్నట్లుగా వాతావరణం చల్లబడింది. అయితే సామాన్యుల నుండి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే విధంగా తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం బీభత్సవం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో వరి పొలాలు మరియు మామిడి ఇంకా పలు రకాల పంటలు నాశనం అవుతున్నాయి. గడచిన మూడు రోజులుగా వడగళ్ల వర్షం అత్యంత దారుణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి వడగళ్ల వర్షం తప్పదు అంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన వాతావరణ మార్పుతో రైతులతో పాటు ఎన్నో వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు విపరీతమైన ఎండ.. ఉక్కపోత మరో వైపు వడగళ్ల వర్షం వల్ల తెలుగు రాష్ట్రాల జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. క్యూమ్యూలో నింబస్ మేఘాల కారణంగా కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురియబోతున్నాయి అంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటన చేసింది.
రాబోయే రెండు రోజుల్లో కొన్ని చోట్ల గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పెద్ద ఎత్తున చెట్లు కూలడంతో పాటు విపత్తులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా క్రికెట్ బాల్ సైజ్ లో ఉండే వడగళ్లు పడుతాయని కూడా అధికారులు పేర్కొన్నారు. ఒక వైపు వడగళ్లు పడుతూ మరో వైపు పగటి పూట వాతావరణంలోని వేడి 2 నుండి 4 డిగ్రీలు పెరిగి విపరీతమైన ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హఠాత్తుగా వర్షం కురియడం.. ఉరుములు మరియు మెరుపులతో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వాతావరణ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటూ ఏపీ రెవిన్యూ శాఖ అధికారులను విపత్తు శాఖ హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.