కరోనా వచ్చినా పర్లేదు.. మందు దొరికితే చాలు!

తమిళనాడు ప్రజలు సామాజిక దూరం(Cosial Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా మధురైలో సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుండా మందు దొరికితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిన వారే సగానికి పైగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Last Updated : Jun 23, 2020, 07:22 AM IST
కరోనా వచ్చినా పర్లేదు.. మందు దొరికితే చాలు!

దేశంలో కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొంటున్న మూడో రాష్ట్రం తమిళనాడు. దాదాపు ఢిల్లీలోనూ ఇదే స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే భౌతిక దూరం (Social Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కడం వల్లే తమిళనాడులో కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు కనిపిస్తోంది. మధురైలోని తపాల్ తంతి నగర్‌లోని మిలిటరీ క్యాంటీన్ వద్ద మద్యం కొనేందుకు ఎగబడ్డ జనమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.  తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఆదివారం(జూన్ 22) నాడు తపాల్ తంతి నగర్‌లోని మిలిటరీ క్యాంటీన్ వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. మద్యం, సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు భౌతిక దూరాన్ని లెక్కచేయలేదు. పైగా అక్కడ కనిపించిన వారిలో సగానికి పైగా 50-60 ఏళ్ల వయసు పైబడిన వారే ఉండటం గమనార్హం. కొందరేమో నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించకుండా మద్యం కోసం వచ్చారు. కరోనా వస్తే మాకేంటి.. మందు దొరికితే చాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు. రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు

కాగా, తమిళనాడులో దాదాపు 62 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 794 మంది కోవిడ్19 బారిన పడి మరణించారు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. చాలా మంది నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తద్వారా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News