Farmers Protest Live Updates -Supreme Court stays three farms laws: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే (stays three farms laws) కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కొత్త సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. ఈ కమిటీలో హర్‌సిమ్రత్ మాన్, ప్రమోద్ కుమార్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్ సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
నూతన వ్యవసాయ చట్టాలు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. సమస్యను పరిష్కరించేందుకు కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది. సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న వారంతా సహకరించి కమిటీని సంప్రదించాలని సూచించింది. రైతులు నేరుగా లేదా తమ న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. Also Read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం
అయితే రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరఫున న్యాయవాది ఎం.ఎల్.శర్మ ధర్మాసనానికి తెలియజేయగా.. అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని, న్యాయ ప్రక్రియ పట్ల రైతు సంఘాలు విశ్వసనీయత చూపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. రైతుల ఆందోళనపై వ్యవహరిస్తున్న విధానం సవ్యంగా లేదంటూ కేంద్రాన్ని సోమవారం సుప్రీంకోర్టు నిలదీసిన విషయం తెలిసిందే. పరిస్థితులు విషమిస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చర్చల వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంపై ధర్మాసనం నిన్న అసంతృప్తి వ్యక్తం చేసింది. Also Read: Madhya Pradesh: ఎంపీలో విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
అయితే మూడు వ్యవసాయ చట్టాలను (Farm laws) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 45 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ చట్టాలపై కేంద్రం (Central Government), రైతు సంఘాల మధ్య ఇప్పటివరకూ ఎనిమిది సార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే మరలా 15తేదీన చర్చలు జరగనున్నాయి. Also Read: Haryana: కర్నాల్‌లో రైతులపై బాష్పవాయు ప్రయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook