న్యూఢిల్లీ: సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మను సెలవుపై పంపుతూ గతేడాది అక్టోబర్ 23న కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పక్కకుపెట్టడం ద్వారా కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అలోక్ వర్మ వ్యవహారంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. అలోక్ వర్మకు సీబీఐ డైరెక్టర్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తనను బలవంతంగా సెలవుపై పంపడంపై అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలోక్ వర్మ విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈమేరకు తీర్పు వెల్లడించింది.
Finance Minister Arun Jaitley: The government had taken this action of sending two senior officers of the CBI on leave on the recommendation of the CVC. (File pic) pic.twitter.com/Nsqdvn9dnK
— ANI (@ANI) January 8, 2019
ఇదిలావుంటే, సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పందించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ''ఇది కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కాదని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సిఫార్సుల మేరకే ఇద్దరు సీబీఐ ఆఫీసర్స్‌ని సెలవుపై పంపడం జరిగింది'' అని అన్నారు.
CBI vs CBI : కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు!