Supreme Court: దేశంలోని ప్రధాన హైకోర్టులో మరో 16 మంది న్యాయమూర్తుల నియామకం

Supreme Court: దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2021, 08:26 AM IST
  • దేశంలోని నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం త్వరలో
  • 16 మంది పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
  • ఆరుగురు జ్యుడీషియల్ ఆఫీసర్లు, పదిమంది న్యాయవాదుల పేర్లు
Supreme Court: దేశంలోని ప్రధాన హైకోర్టులో మరో 16 మంది న్యాయమూర్తుల నియామకం

Supreme Court: దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలోని నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం(Supreme court collegium)16 మంది పేర్లను సూచించింది. బోంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్-హర్యానా హైకోర్టుల కోసం ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సూచించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులైతే మరో పదిమంది న్యాయవాదులున్నారు. ఈ 16 మందికి పదోన్నతి కల్పించి. హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పేర్లను సుప్రీంకోర్టు అప్‌లోడ్ చేసింది. ఎవరిని ఏ హైకోర్టులో అనేది సూచించింది. 

ఎన్ పన్సారే, ఎస్‌సి మోరె,యూఎస్ జోషి ఫాల్కే, బిపి దేశ్ పాండేలను బోంబే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది.ఇక న్యాయవాదులుగా ఉన్నఆదిత్యకుమార్ మహాపాత్రా, మృగాంక శేఖర్ సాహు, జ్యుడీషియల్ ఆఫీసర్లు రాధాకృష్ణ పట్నాయక్, శశికాంత్ మిశ్రాలకు ఒడిశా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించనున్నారు. మౌన మనీష్‌భట్, సమీర్ జే దేవ్, హేమంత్ ఎం పృచ్ఛక్, సందీప్ ఎన్ భట్, అనిరుద్ధ ప్రద్యుమ్న, నీరల్ రష్మీకాంత్ మెహతా, నిషా మహేంద్రభాయ్ ఠాగూర్ పేర్లను గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులుగా సూచించింది. ఇక న్యాయవాది సందీప్ మౌడ్గిల్ పేరును పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా సూచించింది. సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన 16 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణతో(Supreme court chief justice nv ramana) పాటు జస్టిస్ యు యు లలిత్, ఎఎం ఖాన్విల్కర్‌లతో కూడిన కొలీజియం ధర్మాసనం హైకోర్టులో న్యాయమూర్తుల భర్తీకోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. జస్టిస్ ఎన్‌వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ వందమంది పేర్లను సూచించారు. సుప్రీంకోర్టులో ఉన్న 9 ఖాళీల్ని భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో ఇప్పటికీ 60 శాతం న్యాయమూర్తుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దేశంలోని 25 హైకోర్టుల్లో 1080 మంది న్యాయమూర్తులు ఉండాల్సి వస్తే..ఇప్పటి వరకూ 420 మంది మాత్రమే ఉన్నారు. 

Also read: Viral Video: కేంద్ర మంత్రి ఓ మంచి డ్యాన్సర్: ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News