Supreme Court grants 10-years time to telecos: న్యూఢిల్లీ: టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సిన బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి సుమారు 1.6లక్షల కోట్ల బకాయిలను టెలికాం సంస్థలు చెల్లించాల్సి ఉంది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వచ్చే ఏడాది 2021 మార్చి 31 పదిశాతం బకాయిలను చెల్లించాలని.. పదేళ్లల్లో (2031 నాటికి) ఏడీఆర్ బకాయిలన్నీంటిని చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. Also read: Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..!
అయితే బకాయిల చెల్లింపులపై టెలికాం ఎండీలు, సీఈవోలు నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత బ్యాంకు గ్యారంటీలు యథాతధంగా కొనసాగుతాయని, వడ్డీ చెల్లింపుల వివరాలు ప్రతి సంవత్సరం అందించాలని పేర్కొంది. ఇన్‌స్టాల్‌మెంట్లు, AGR బకాయిలు చెల్లిచడంలో కంపెనీలు విఫలమైతే జరిమానా, వడ్డీతోపాటు కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదవుతుందని హెచ్చరించింది. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో భారతి ఎయిర్‌టెల్, ఐడీయా, వొడాఫోన్ వంటి సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ విషయంలో వెసులుబాటు కల్పించకపోతే.. భారతదేశంలో తన వ్యాపారాన్ని మూసివేయక తప్పదని వోడాఫోన్ ఒక సందర్భంలో పేర్కొంది. Also read: Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్
AGR Dues: సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు ఊరట